సూరా 9 · జుజ్ 10

At-Tawbah · 9:66

لَا تَعْتَذِرُوا قَدْ كَفَرْتُمْ بَعْدَ إِيمَانِكُمْ ۚ إِنْ نَعْفُ عَنْ طَائِفَةٍ مِنْكُمْ نُعَذِّبْ طَائِفَةً بِأَنَّهُمْ كَانُوا مُجْرِمِينَ

ఇక మీరు సాకులు చెప్పకండి, వాస్తవానికి మీరు విశ్వసించిన తరువాత సత్యాన్ని తిరస్కరించారు." మీలో కొందరిని మేము క్షమించినా ఇతరులను తప్పకుండా శిక్షిస్తాము, ఎందుకంటే వాస్తవానికి వారు అపరాధులు.

తఫ్సీర్

ఈ అబద్దపు సాకుల ద్వారా వంకలు పెట్టకండి,నిశ్చయంగా మీరు అవిశ్వాసమును దాచిపెట్టిన తరువాత మీ హేళన ద్వారా దాన్ని బహిర్గతం చేశారు.ఒక వేళ కపటత్వము నుంచి పశ్చాత్తాప్పడి వదిలి వేయటం వలన,అల్లాహ్ కొరకు చిత్తశుద్ది కలిగి ఉండటం వలన మీలోనుంచి ఒక వర్గమును మేము మన్నించి వేసినా మీలో నుంచి ఒక వర్గమును కపటత్వములో మొండిగా ఉండి దాని నుండి వారి పశ్చాత్తాపము లేక పోవటం వలన శిక్షిస్తాము.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి