సూరా 9 · జుజ్ 11
At-Tawbah · 9:104
أَلَمْ يَعْلَمُوا أَنَّ اللَّهَ هُوَ يَقْبَلُ التَّوْبَةَ عَنْ عِبَادِهِ وَيَأْخُذُ الصَّدَقَاتِ وَأَنَّ اللَّهَ هُوَ التَّوَّابُ الرَّحِيمُ
ఏమీ? వాస్తవానికి అల్లాహ్ తన దాసుల పశ్చాత్తాపాన్ని (తౌబహ్ ను) అంగీకరిస్తాడని మరియు వారి దానాలను (సదఖాత్ లను) స్వీకరిస్తాడని వారికి తెలియదా? నిశ్చయంగా, అల్లాహ్! ఆయన మాత్రమే, పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణా ప్రదాత.
తఫ్సీర్
ధర్మ పోరాటము నుండి వెనుక ఉండిపోయిన వీరందరు,అల్లాహ్ వైపు పశ్చాత్తాపం చెందేవారు అల్లాహ్ తన వైపు పశ్చాత్తాప్పడే దాసుల పశ్చాత్తాపమును స్వీకరిస్తాడని,దానధర్మాలను స్వీకరిస్తాడని తెలుసుకోవాలి.మరియు ఆయన వాటి యొక్క అవసరం లేనివాడు.మరియు ఆయన దాన ధర్మాలు చేసేవాడికి అతని దానధర్మాలకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.మరియు ఆయన పరిశుద్ధుడు,ఆయన తన దాసుల్లోంచి పశ్చాత్తాప్పడే వారి పశ్చాత్తాపమును స్వీకరించేవాడు,వారిపై కరుణించే వాడు.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి