సూరా 9 · జుజ్ 11

At-Tawbah · 9:103

خُذْ مِنْ أَمْوَالِهِمْ صَدَقَةً تُطَهِّرُهُمْ وَتُزَكِّيهِمْ بِهَا وَصَلِّ عَلَيْهِمْ ۖ إِنَّ صَلَاتَكَ سَكَنٌ لَهُمْ ۗ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ

(కావున ఓ ప్రవక్తా!) నీవు వారి సంపదల నుండి దానం (సదఖహ్) తీసుకొని, దానితో వారి పాపవిమోచనం చెయ్యి మరియు వారిని సంస్కరించు. మరియు వారి కొరకు (అల్లాహ్ ను) ప్రార్థించు. మరియు నిశ్చయంగా, నీ ప్రార్థనలు వారికి మనశ్శాంతిని కలిగిస్తాయి. అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.

తఫ్సీర్

ఓ ప్రవక్తా వారి సంపదల నుండి జకాతును తీసుకుని వాటి ద్వారా అవిధేయకార్యాల,పాపకార్యాల అశుద్ధత నుండి వారిని పరిశుద్ధపరచండి.మరియు వాటి ద్వారా వారి పుణ్య కార్యాలను పెంచండి.వారి నుండి వాటిని తీసుకున్న తరువాత వారి కొరకు మీరు ప్రార్ధించండి.నిశ్చయంగా మీ ప్రార్ధన వారి కొరకు కారుణ్యము,మనశ్శాంతి.మరియు అల్లాహ్ మీ ప్రార్ధనలను వినేవాడును,వారి కర్మలను,వారి సంకల్పాలను తెలుసుకునే వాడును.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి