సూరా 7 · జుజ్ 9
Al-A'raf · 7:173
أَوْ تَقُولُوا إِنَّمَا أَشْرَكَ آبَاؤُنَا مِنْ قَبْلُ وَكُنَّا ذُرِّيَّةً مِنْ بَعْدِهِمْ ۖ أَفَتُهْلِكُنَا بِمَا فَعَلَ الْمُبْطِلُونَ
లేక: "వాస్తవానికి ఇంతకు పూర్వం మా తాతముత్తాతలు అల్లాహ్ కు సాటి (భాగస్వాములు) కల్పించారు. మేము వారి తరువాత వచ్చిన, వారి సంతతి వారం (కాబట్టి వారిని అనుసరించాము). అయితే? ఆ అసత్యవాదులు చేసిన కర్మలకు నీవు మమ్మల్ని నశింప జేస్తావా?" అని అనగూడదని.
తఫ్సీర్
లేదా మీ తాత ముత్తాతలు వారే వాగ్ధానమును (ఒప్పందమును) భంగపరచి అల్లాహ్ తోపాటు సాటి కల్పించారని,మీరు మీ తాతముత్తాతలను షిర్కు (బహుదైవారాధన) చేస్తుండగా పొంది వారిని అనుకరించే వారని అప్పుడు మీరు ఓ ప్రభువా మా తాత ముత్తాతలు అల్లాహ్ తోపాటు సాటి కల్పించి తమ ఆచరణలను వృధా చేసుకున్న వారి చర్యపై మమ్మల్ని పట్టుకుంటావా ,మమ్మల్ని శిక్షిస్తావా అని ? వాదించకుండా ఉండటానికి. మా అజ్ఞానము వలన మా తాత ముత్తాతలను మేము అనుకరించటం వలన మాదే పాపము లేదు.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి