సూరా 7 · జుజ్ 9

Al-A'raf · 7:172

وَإِذْ أَخَذَ رَبُّكَ مِنْ بَنِي آدَمَ مِنْ ظُهُورِهِمْ ذُرِّيَّتَهُمْ وَأَشْهَدَهُمْ عَلَىٰ أَنْفُسِهِمْ أَلَسْتُ بِرَبِّكُمْ ۖ قَالُوا بَلَىٰ ۛ شَهِدْنَا ۛ أَنْ تَقُولُوا يَوْمَ الْقِيَامَةِ إِنَّا كُنَّا عَنْ هَٰذَا غَافِلِينَ

మరియు (జ్ఞాపకం చేసుకోండి!) నీ ప్రభువు ఆదమ్ సంతతి వారి వీపున నుండి వారి సంతానాన్ని తీసి, వారికి వారినే సాక్షులుగా నిలబెట్టి: "ఏమీ? నేను మీ ప్రభువును కానా?" అని అడుగగా! వారు: "అవును! (నీవే మా ప్రభువని) మేము సాక్ష్యమిస్తున్నాము." అని జవాబిచ్చారు. తీర్పుదినమున మీరు: "నిశ్చయంగా, మేము దీనిని ఎరుగము." అని అనగూడదని.

తఫ్సీర్

ఓ ముహమ్మద్ మీరు ఒక సారి గుర్తు చేసుకోండి నీ ప్రభువు ఆదమ్ సంతతి వీపుల నుండి వారి సంతానమును తీసి వారి స్వభావములో నాటిన వాగ్ధానము ద్వారా తన దైవత్వమును (రుబూబియత్ ను) నిరూపించటానికి వారితో నేను మీ ప్రభువును కానా ? అని పలుకుతూ ప్రమాణం తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన వారి సృష్టి కర్త,వారి ప్రభువు. వారందరు ఎందుకు కాదు నీవు మా ప్రభువు అని సమాధానమిచ్చారు. ఆయన (అల్లాహ్) ఇలా సమాధానమిచ్చాడు : మీరు ప్రళయ దినాన మీపై ఉన్న అల్లాహ్ వాదనను నిరాకరించకుండా ఉండటానికి,దాని గురించి మీరు మీకు జ్ఞానం లేదు అని అనకుండా ఉండటానికి మేము మిమ్మల్ని పరీక్షించినాము,మీపై ప్రమాణమును తీసుకున్నాము.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి