సూరా 7 · జుజ్ 9
Al-A'raf · 7:161
وَإِذْ قِيلَ لَهُمُ اسْكُنُوا هَٰذِهِ الْقَرْيَةَ وَكُلُوا مِنْهَا حَيْثُ شِئْتُمْ وَقُولُوا حِطَّةٌ وَادْخُلُوا الْبَابَ سُجَّدًا نَغْفِرْ لَكُمْ خَطِيئَاتِكُمْ ۚ سَنَزِيدُ الْمُحْسِنِينَ
మరియు వారికి ఇలా ఆజ్ఞ ఇవ్వబడిన సందర్భాన్ని (జ్ఞాపకం చేసుకోండి!): "ఈ నగరంలో నివసించి, అందులో మీ ఇష్టప్రకారం తినండి. మరియు :'మా పాపాలను క్షమించు (హిత్తతున్), అని అంటూ ఉండండి. మరియు సాష్టాంగ పడుతూ దాని ద్వారంలో ప్రవేశించండి, మేము మీ పాపాలను క్షమిస్తాము. మేము సజ్జనులను అధికంగా (అనుగ్రహిస్తాము)."
తఫ్సీర్
ఓ ప్రవక్తా మీరు ఒక సారి అల్లాహ్ ఇస్రాయీలు సంతతి వారితో ఇలా పలికిన ఆ సంధర్భాన్ని గుర్తు చేసుకోండి మీరు బైతుల్ మఖ్దిస్ లో ప్రవేశించండి. దాని బస్తీ నుండి ఫలాలను మీరు ఏ చోటు నుండి,ఏ సమయములో మీరు కోరుకుంటే అప్పుడు తినండి. మరియు మీరు ఓ మా ప్రభువా మా పాపములను మన్నించు అని అనండి. మరియు మీరు మీ ప్రభువు కొరకు సాష్టాంగపడుతూ అణుకువతో ద్వారం గుండా ప్రవేశించండి. ఒక వేళ మీరు ఇలా చేస్తే మేము మీ పాపములను మన్నించి వేస్తాము. మరియు తొందరలోనే మేము సజ్జనులకు ఇహపర లోకాల మేళ్ళను (శుభాలను) ఎక్కువగా ప్రసాదిస్తాము.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి