సూరా 7 · జుజ్ 9
Al-A'raf · 7:160
وَقَطَّعْنَاهُمُ اثْنَتَيْ عَشْرَةَ أَسْبَاطًا أُمَمًا ۚ وَأَوْحَيْنَا إِلَىٰ مُوسَىٰ إِذِ اسْتَسْقَاهُ قَوْمُهُ أَنِ اضْرِبْ بِعَصَاكَ الْحَجَرَ ۖ فَانْبَجَسَتْ مِنْهُ اثْنَتَا عَشْرَةَ عَيْنًا ۖ قَدْ عَلِمَ كُلُّ أُنَاسٍ مَشْرَبَهُمْ ۚ وَظَلَّلْنَا عَلَيْهِمُ الْغَمَامَ وَأَنْزَلْنَا عَلَيْهِمُ الْمَنَّ وَالسَّلْوَىٰ ۖ كُلُوا مِنْ طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ ۚ وَمَا ظَلَمُونَا وَلَٰكِنْ كَانُوا أَنْفُسَهُمْ يَظْلِمُونَ
మరియు మేము వారిని పన్నెండు తెగలుగా (వర్గాలుగా) విభవించాము. మరియు మూసా జాతి వారు అతనిని నీటి కొరకు అడిగినపుడు, మేము అతనిని: "నీ చేతికర్రతో రాయిపై కొట్టు!" అని ఆజ్ఞాపించాము. అపుడు దాని నుండి పన్నెండు ఊటలు ప్రవహించసాగాయి. అపుడు ప్రతి తెగవారు, తాము నీళ్ళు తీసుకునే స్థలాన్ని తెలుసుకున్నారు. మరియు మేము వారిపై మేఘాల ఛాయను కల్పించాము. మరియు వారి కొరకు మన్న మరియు సల్వాలను దింపాము: "మేము మీకు ప్రసాదించిన పరిశుద్ధమైన పదార్థాలను తినండి." అని అన్నాము. మరియు వారు మాకు అన్యాయం చేయలేదు, కాని తమకు తామే అన్యాయం చేసుకున్నారు.
తఫ్సీర్
మరియు మేము ఇస్రాయీలు సంతతి వారిని పన్నెండు తెగలుగా విభజించాము. మూసాను ఆయన జాతి వారు తమ కొరకు నీళ్ళను ఏర్పాటు చేయమని అల్లాహ్ ను వేడుకోమని కోరినప్పుడు మేము ఆయనకు దైవ వాణి ద్వారా ఓ మూసా మీ చేతి కర్రను రాయి పై కొట్టండి అని ఆదేశించాము. మూసా దానిని కొట్టారు. అప్పుడు దానితో వారి పన్నెండు తెగలకు సమానంగా పన్నెండు ఊటలు ప్రవహించ సాగాయి. వారిలోంచి ప్రతి తెగ నీటిని త్రాగే తమ ప్రత్యేక ప్రదేశమును తెలుసుకుంది. అందులో ఒక తెగ తోపాటు వేరొక తెగ భాగసాములు కారు. వారిపై మేఘమును నీడగా చేశాము. అది వారు నడిచే చోటు నడిచేది. వారు ఆగే చోటు ఆగేది. మరియు మేము వారిపై మా అనుగ్రహాల్లోంచి తేనె మాదిరిగా తియ్యగా ఉండే పానియమును,పిట్టల మాదిరిగా స్వచ్చమైన మాంసము కల చిన్న పక్షులను దించాము. మరియు మేము వారితో ఇలా పలికాము : మీకు మేము ప్రసాదించిన ధర్మ సమ్మతమైన వాటిలోంచి మీరు తినండి. వారి నుండి జరిగిన అన్యాయము,అనుగ్రహాల పట్ల కృతఘ్నత వైఖరి,వాటి పట్ల ఏవిధమైన మర్యాద ఉండాలో ఆ విధమైన మర్యాద లేక పోవటం వలన వారు మాకు ఎటువంటి నష్టం చేకూర్చ లేదు. కాని వారు అల్లాహ్ ఆదేశమునకు వ్యతిరేకించటము,ఆయన అనుగ్రహాలను తిరస్కరించటం లాంటి కార్యాలకు పాల్పడటం వలన వినాశమునకు గురి అయినప్పుడు అనుగ్రహాల వాటాను కోల్పోవటం ద్వారా వారు తమ స్వయానికే అన్యాయం చేసుకున్నారు.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి