సూరా 7 · జుజ్ 9

Al-A'raf · 7:153

وَالَّذِينَ عَمِلُوا السَّيِّئَاتِ ثُمَّ تَابُوا مِنْ بَعْدِهَا وَآمَنُوا إِنَّ رَبَّكَ مِنْ بَعْدِهَا لَغَفُورٌ رَحِيمٌ

మరియు ఎవరు దుష్కార్యాలు చేసిన పిదప, పశ్చాత్తాపపడతారో మరియు విశ్వసిస్తారో! అలాంటి వారు నిశ్చయంగా, ఆ తరువాత నీ ప్రభువును క్షమించేవాడుగా, కరుణించేవాడుగా పొందుతారు.

తఫ్సీర్

మరియు ఎవరైతే అల్లాహ్ తో పాటు సాటి కల్పించి,అవిధేయ కార్యాలకు పాల్పడి దుష్కార్యాలు చేస్తారో ఆపిదప అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి తాము చేసే అవిధేయ కార్యాలను విడనాడి అల్లాహ్ తో పశ్చాత్తాపపడుతారో ఓ ప్రవక్తా నిశ్చయంగా నీ ప్రభువు ఈ పశ్చాత్తాపము,షిర్కు నుండి విశ్వాసము వైపునకు,అవిధేయ కార్యాల నుండి విధేయత వైపునకు మరలటం తరువాత పాపములపై పరదా కప్పటం,మన్నించటం ద్వారా వారిని క్షమించే వాడును,వారిపై కరుణించే వాడును.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి