సూరా 7 · జుజ్ 9

Al-A'raf · 7:152

إِنَّ الَّذِينَ اتَّخَذُوا الْعِجْلَ سَيَنَالُهُمْ غَضَبٌ مِنْ رَبِّهِمْ وَذِلَّةٌ فِي الْحَيَاةِ الدُّنْيَا ۚ وَكَذَٰلِكَ نَجْزِي الْمُفْتَرِينَ

ఆవుదూడను (దైవంగా) చేసుకున్న వారు తప్పకుండా తమ ప్రభువు ఆగ్రహానికి గురి అవుతారు మరియు వారు ఇహలోక జీవితంలో అవమానం పాలవుతారు. మరియు అసత్యాలు కల్పించే వారిని మేము ఇదే విధంగా శిక్షిస్తాము.

తఫ్సీర్

నిశ్చయంగా ఎవరైతే ఆవు దూడను ఆరాధ్య దైవంగా చేసుకుని ఆరాధించేవారో వారికి తొందరలోనే తమ ప్రభువును ఆగ్రహానికి గురి చేసినందుకు,ఆయనను అవమాన పరిచినందుకు తమ ప్రభువు వద్ద నుండి వారికి తీవ్ర ఆగ్రహము,అవమానము ఇహలోక జీవితంలోనే చేరుతుంది. ఈ విధమైన ప్రతిఫలం లాంటి దాన్నే మేము అల్లాహ్ పై అబద్దమును అంటగట్టే వారికి ప్రసాదిస్తాము.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి