సూరా 7 · జుజ్ 9
Al-A'raf · 7:148
وَاتَّخَذَ قَوْمُ مُوسَىٰ مِنْ بَعْدِهِ مِنْ حُلِيِّهِمْ عِجْلًا جَسَدًا لَهُ خُوَارٌ ۚ أَلَمْ يَرَوْا أَنَّهُ لَا يُكَلِّمُهُمْ وَلَا يَهْدِيهِمْ سَبِيلًا ۘ اتَّخَذُوهُ وَكَانُوا ظَالِمِينَ
మరియు మూసా జాతి వారు, అతను పోయిన పిదప తమ ఆభరణాలతో ఒక ఆవు దూడ విగ్రహాన్ని తయారు చేశారు. దానిలో నుండి (ఆవు అరుపు వంటి) ధ్వని వచ్చేది. ఏమీ? అది వారితో మాట్లాడజాలదని మరియు వారికి ఏ విధమైన మార్గదర్శకత్వం చేయజాలదని వారికి తెలియదా? అయినా వారు దానిని (దైవంగా) చేసుకొని పరమ దుర్మార్గులయ్యారు.
తఫ్సీర్
మూసా జాతి వారు ఆయన తన ప్రభువుతో సంభాషించటానికి వెళ్లిన తరువాత తమ నగలతో ఆవు దూడ శిల్పమును తయారు చేసి పెట్టుకున్నారు. అందులో ప్రాణం లేదు,దాని కొరకు ఒక శబ్దం ఉండేది. ఈ ఆవు దూడ వారితో మాట్లాడదని,వారికి మంచి ఇంద్రియ లేద నైతిక మార్గమును చూపించ లేదని మరియు వారి కొరకు లాభమును తీసుకుని రాలేదని లేద వారి నుండి నష్టమును దూరం చేయలేదని వారికి తెలియదా?. వారు దాన్ని ఆరాధ్య దైవముగా చేసుకున్నారు. దాని వలన వారు తమపై అన్యాయానికి పాల్పడిన వారైపోయారు.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి