సూరా 7 · జుజ్ 9
Al-A'raf · 7:147
وَالَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا وَلِقَاءِ الْآخِرَةِ حَبِطَتْ أَعْمَالُهُمْ ۚ هَلْ يُجْزَوْنَ إِلَّا مَا كَانُوا يَعْمَلُونَ
మరియు మా సూచనలను (ఆయాత లను) మరియు పరలోక దర్శనాన్ని (పునరుత్థాన దినాన్ని) అబద్ధాలని తిరస్కరించిన వారు చేసిన కర్మలన్నీ వ్యర్థమవుతాయి. ఏమీ? వారు కేవలం తమ కర్మలకు తగిన ప్రతిఫలం తప్ప మరేమైనా పొందగలరా!
తఫ్సీర్
మరియు ఎవరైతే మన ప్రవక్త నీతిని నిర్దేశించే మా సూచనలను తిరస్కరిస్తారో,ప్రళయ దినాన అల్లాహ్ ను కలవటంను తిరస్కరిస్తారో వారి ఆచరణలు విధేయతలకు సంబంధించినవి వ్యర్ధమైపోతాయి. వాటి షరతుల్లోంచిదైన విశ్వాసము లేకపోవటం వలన వాటికి ప్రతిఫలం వారికి ప్రసాధించబడదు. వారు అల్లాహ్ పట్ల అవిశ్వాసం వలన చేసుకున్న కర్మలకు ఆయనతో సాటి కల్పించటంనకు మాత్రమే వారికి ప్రళయ దినాన ప్రతిఫలం ప్రసాదించబడుతుంది. నరకంలో ఎల్లప్పుడు,శాస్వతంగా ఉండటమే దాని ప్రతిఫలం.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి