సూరా 6 · జుజ్ 8

Al-An'am · 6:161

قُلْ إِنَّنِي هَدَانِي رَبِّي إِلَىٰ صِرَاطٍ مُسْتَقِيمٍ دِينًا قِيَمًا مِلَّةَ إِبْرَاهِيمَ حَنِيفًا ۚ وَمَا كَانَ مِنَ الْمُشْرِكِينَ

వారితో ఇలా అను: "నిశ్చయంగా, నా ప్రభువు నాకు ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేశాడు. అదే సరైన ధర్మం. ఏకదైవ సిద్ధాంతమైన ఇబ్రాహీమ్ ధర్మం. అతను అల్లాహ్ కు సాటి కల్పించే వారిలో చేరినవాడు కాడు!"

తఫ్సీర్

ఓ ప్రవక్తా తిరస్కార వైఖరి కల ఈ ముష్రికులందరితో ఇలా తెలపండి : నా ప్రభువు ఒక సన్మార్గమును నాకు చూపించాడు. అది ఇహ,పరలోక ప్రయోజనాల ద్వారా స్థిరమైన ధర్మము యొక్క మార్గము. సత్యం వైపునకు మరలిన ఇబ్రాహీం యొక్క ధర్మము అది. ఆయన ఎప్పుడు కూడా ముష్రికుల్లోంచి కాలేదు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి