సూరా 6 · జుజ్ 8

Al-An'am · 6:160

مَنْ جَاءَ بِالْحَسَنَةِ فَلَهُ عَشْرُ أَمْثَالِهَا ۖ وَمَنْ جَاءَ بِالسَّيِّئَةِ فَلَا يُجْزَىٰ إِلَّا مِثْلَهَا وَهُمْ لَا يُظْلَمُونَ

ఎవడు ఒక సత్కార్యం చేస్తాడో, అతనికి దానికి పదిరెట్లు ప్రతిఫలం ఉంటుంది. మరియు ఎవడు ఒక పాపకార్యం చేస్తాడో, అతనికి దానంతటి శిక్షయే ఉంటుంది. మరియు వారి కెలాంటి అన్యాయం జరుగదు.

తఫ్సీర్

విశ్వాసపరుల్లోంచి ఎవరైన ఒక సత్కార్యమును చేసి ఉంటే అల్లాహ్ ప్రళయదినాన దానిని అతని కొరకు పది సత్కార్యాలుగా పెంచుతాడు. ఎవరన్న పాప కార్యమునకు పాల్పడితే అది చిన్నదైన, పెద్దదైన దాని ప్రకారం అతనిని శిక్షించటం జరుగుతుంది. సత్కార్యాల పుణ్యమును తగ్గించి పాప కార్యాల శిక్షను పెంచి ప్రళయదినాన వారికి అన్యాయం చేయటం జరగదు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి