సూరా 6 · జుజ్ 8

Al-An'am · 6:146

وَعَلَى الَّذِينَ هَادُوا حَرَّمْنَا كُلَّ ذِي ظُفُرٍ ۖ وَمِنَ الْبَقَرِ وَالْغَنَمِ حَرَّمْنَا عَلَيْهِمْ شُحُومَهُمَا إِلَّا مَا حَمَلَتْ ظُهُورُهُمَا أَوِ الْحَوَايَا أَوْ مَا اخْتَلَطَ بِعَظْمٍ ۚ ذَٰلِكَ جَزَيْنَاهُمْ بِبَغْيِهِمْ ۖ وَإِنَّا لَصَادِقُونَ

"మరియు యూదమతం అవలంబించిన వారికి మేము గోళ్ళు ఉన్న అన్ని జంతువులను నిషేధించాము. మరియు వారికి ఆవు మరియు మేకలలో, వాటి వీపులకు లేదా ప్రేగులకు తగిలివున్న మరియు ఎముకలలో మిశ్రమమై ఉన్న క్రొవ్వు తప్ప, మిగతా (క్రొవ్వును) నిషేధించాము. ఇది వారి అక్రమాలకు విధించిన శిక్ష. మరియు నిశ్చయంగా, మేము సత్యవంతులము!"

తఫ్సీర్

మరియు మేము వ్రేళ్ళు విడిగా లేని ఒంటెలు,నిప్పుకోళ్ళు లాంటి వాటిని యూదులపై నిషేదించాము. మరియు ఆవులు,మేకల వీపులకు తగిలిన,వాటి పేగులకు తగిలిన,ప్రక్కటెముకులకు తగిలిన క్రొవ్వు తప్ప ఇతర క్రొవ్వును మేము నిషేదించాము. వారు తమపై వాటిని నిషేదించుకుని దుర్మార్గముకు పాల్పడినందుకు మేము వారికి ప్రతిఫలాన్ని ప్రసాధించాము. నిశ్చయంగా మేము చెప్పే మాటలన్నింటిలో సత్యవంతులము.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి