సూరా 6 · జుజ్ 8

Al-An'am · 6:145

قُلْ لَا أَجِدُ فِي مَا أُوحِيَ إِلَيَّ مُحَرَّمًا عَلَىٰ طَاعِمٍ يَطْعَمُهُ إِلَّا أَنْ يَكُونَ مَيْتَةً أَوْ دَمًا مَسْفُوحًا أَوْ لَحْمَ خِنْزِيرٍ فَإِنَّهُ رِجْسٌ أَوْ فِسْقًا أُهِلَّ لِغَيْرِ اللَّهِ بِهِ ۚ فَمَنِ اضْطُرَّ غَيْرَ بَاغٍ وَلَا عَادٍ فَإِنَّ رَبَّكَ غَفُورٌ رَحِيمٌ

(ఓ ప్రవక్తా!) వారికి తెలుపు: "నాపై అవతరింబజేయబడిన దివ్యజ్ఞానంలో (వహీలో) :ఆహారపదార్థాలలో చచ్చిన జంతువు, కారిన రక్తం, పంది మాంసం - ఎందుకంటే అది అపరిశుద్ధమైది (రిజ్స్); లేక అల్లాహ్ కు అవిధేయతకు పాల్పడి - ఆయన పేరుతో గాక - ఇతరుల పేరుతో కోయబడిన జంతువు తప్ప, ఇతర వాటిని తినటాన్ని నిషేధించబడినట్లు నేను చూడలేదు. కాని ఎవడైనా గత్యంతరం లేని పరిస్థితులలో దుర్నీతికి ఒడిగట్టకుండా, ఆవశ్యకత వలన హద్దులు మీరకుండా (తింటే) నీ ప్రభువు నిశ్చయంగా, క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.

తఫ్సీర్

ఓ ప్రవక్తా మీరు తెలియజేయండి : అల్లాహ్ నా వైపునకు వహీ ద్వారా తెలిపిన వాటిలో (నిషేధించబడినవిగా) జుబాహ్ చేయకుండా చనిపోయిన జంతువును లేదా ప్రవహించే రక్తం ను లేదా పంది మాంసమును ఎందుకంటే అది అశుద్ధమైనది నిషేదించడినది లేదా అల్లాహ్ నామం కాకుండా ఇతరుల నామం తీసుకుని జుబాహ్ చేయబడినవి. ఉదాహరణకి వారి విగ్రహాల పేరుతో జుబాహ్ చేయబడినది నిషేదించబడినవిగా నేను పొందాను. ఎవరికైనను ఈ నిషేదాలను ఆకలి తీవ్రత వలన తినటం అత్యవసరం అయితే వాటిని తినటంలో రుచిని ఆస్వాధించే ఉద్దేశం లేకుండా, అవసరాన్ని మించకుండా తినటంలో అతనిపై ఎటువంటి పాపం లేదు. ఓ ప్రవక్తా గత్యంతరం లేని వాడు ఒక వేళ అందులోంచి తింటే నిశ్చయంగా మీ ప్రభువు అతనిని క్షమించే వాడును.అతనిపై కరుణించేవాడును.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి