సూరా 57 · జుజ్ 27

Al-Hadid · 57:10

وَمَا لَكُمْ أَلَّا تُنْفِقُوا فِي سَبِيلِ اللَّهِ وَلِلَّهِ مِيرَاثُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ لَا يَسْتَوِي مِنْكُمْ مَنْ أَنْفَقَ مِنْ قَبْلِ الْفَتْحِ وَقَاتَلَ ۚ أُولَٰئِكَ أَعْظَمُ دَرَجَةً مِنَ الَّذِينَ أَنْفَقُوا مِنْ بَعْدُ وَقَاتَلُوا ۚ وَكُلًّا وَعَدَ اللَّهُ الْحُسْنَىٰ ۚ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ

మరియు మీకేమయింది? మీరెందుకు అల్లాహ్ మార్గంలో ఖర్చుపెట్టడం లేదు? ఆకాశాలు మరియు భూమి యొక్క వారసత్వం అల్లాహ్ కే చెందుతుంది. (మక్కా) విజయానికి ముందు (అల్లాహ్ మార్గంలో) ఖర్చు పెట్టిన వారితో మరియు పోరాడిన వారితో, (మక్కా విజయం తరువాత పోరాడిన వారు మరియు ఖర్చుపెట్టినవారు) సమానులు కాజాలరు! అలాంటి వారి స్థానం (విజయం తరువాత అల్లాహ్ మార్గంలో) ఖర్చు పెట్టిన మరియు పోరాడిన వారి కంటే గొప్పది. కాని వారందరికీ అల్లాహ్ ఉత్తమమైన (ప్రతిఫలం) వాగ్దానం చేశాడు. మరియు మీరు చేసేదంతా అల్లాహ్ బాగా ఎరుగును.

తఫ్సీర్

అల్లాహ్ మార్గములో ఖర్చు చేయటం నుండి మిమ్మల్ని ఏది ఆపుతుంది ?! మరియు ఆకాశముల మరియు భూమి యొక్క వారసత్వము అల్లాహ్ కే చెందుతుంది. ఓ విశ్వాసపరులారా మక్కా పై విజయం కన్న ముందు అల్లాహ్ మార్గములో ఆయన మన్నతను ఆశిస్తూ తన సంపదను ఖర్చు చేసి,ఇస్లాంకు మద్దతు కొరకు అవిశ్వాసపరులతో పోరాడినవారు మక్కా విజయము తరువాత ఖర్చు చేసి,అవిశ్వాసపరులతో పోరాడిన వారితో సమానం కాజాలరు. విజయం కన్న ముందు ఖర్చు చేసినవారు మరియు అల్లాహ్ మార్గంలో పోరాడిన వారందరు దాని విజయం తరువాత తమ సంపదలను అల్లాహ్ మార్గములో ఖర్చు చేసి,అవిశ్వాసపరులతో పోరాడిన వారికన్న అల్లాహ్ వద్ద గొప్ప స్థానము కలవారు. వాస్తవానికి అల్లాహ్ ఇరు వర్గముల కొరకు స్వర్గపు వాగ్దానం చేశాడు. మీరు చేస్తున్నది అల్లాహ్ కు తెలుసు. మీ కర్మల్లోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. మరియు తొందరలోనే ఆయన వాటి పరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి