సూరా 5 · జుజ్ 7
Al-Ma'idah · 5:85
فَأَثَابَهُمُ اللَّهُ بِمَا قَالُوا جَنَّاتٍ تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ وَذَٰلِكَ جَزَاءُ الْمُحْسِنِينَ
కావున వారు పలికిన దానికి ఫలితంగా, అల్లాహ్ వారికి క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలను ప్రసాదించాడు. వారందులో శాశ్వతంగా ఉంటారు. మరియు సజ్జనులకు లభించే ప్రతిఫలం ఇదే!
తఫ్సీర్
సత్యాన్ని స్వీకరించి,దానిపై వారు విశ్వాసమును కనబరచటానికి ప్రతి ఫలంగా వారికి అల్లాహ్ భవనాల,వృక్షాల క్రింది నుంచి కాలువలు ప్రవహించే స్వర్గ వనాలను ప్రసాదించాడు. వాటిలో వారు ఎల్లప్పుడు ఉంటారు.సత్యాన్ని అనుసరించి ఎటువంటి పరిమితి లేదా షరతు లేకుండా దానికి కట్టుబడి ఉండటం వలన సజ్జనులకు ఈ ప్రతిఫలము ప్రసాదించటం జరిగింది.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి