సూరా 5 · జుజ్ 6
Al-Ma'idah · 5:75
مَا الْمَسِيحُ ابْنُ مَرْيَمَ إِلَّا رَسُولٌ قَدْ خَلَتْ مِنْ قَبْلِهِ الرُّسُلُ وَأُمُّهُ صِدِّيقَةٌ ۖ كَانَا يَأْكُلَانِ الطَّعَامَ ۗ انْظُرْ كَيْفَ نُبَيِّنُ لَهُمُ الْآيَاتِ ثُمَّ انْظُرْ أَنَّىٰ يُؤْفَكُونَ
మర్యమ్ కుమారుడు మసీహ్ (క్రీస్తు) కేవలం ఒక ప్రవక్త మాత్రమే. అతనికి పూర్వం కూడా అనేక ప్రవక్తలు గతించారు. మరియు అతని తల్లి సత్యవతి (సిద్ధీఖహ్). వారిద్దరూ ఆహారం తినేవారు. చూడండి! మేము వారికి ఈ సూచనలను ఏ విధంగా స్పష్టపరిచామో! అయినా చూడండి! ఏ విధంగా వారు మోసగింపబడుతున్నారో (సత్యం నుండి మరలింపబడుతున్నారో)!
తఫ్సీర్
మర్యమ్ కుమారుడగు ఈసా మసీహ్ ప్రవక్తల్లోంచి ఒక ప్రవక్త మాత్రమే. వారికి మరణం వచ్చినట్లే ఈయనకు మరణం వస్తుంది. మరియు అతని తల్లి, మర్యం అలైహస్సలాం, చాలా నిజాయతీ పరురాలు, సత్యాన్ని స్వీకరించే స్త్రీ. వారిద్దరు తమకు భోజన అవసరముంది కాబట్టి తింటున్నారు. భోజన అవసరమున్న వారు ఎలా దైవాలవుతారు ?. ఓప్రవక్తా! ఏకత్వమును నిరూపించే ఆయతులను మేము ఏవిధంగా వివరిస్తున్నామో, అల్లాహేతరుల కొరకు దైవత్వం అపాదించే విషయంలో వారి హద్దు మీరిన ప్రవర్తన అసత్యమన్న విషయంలో మీరు యోచనతో దృష్టిని సారించండి. అయినా కూడా వారు ఈ ఆయతులను తిరస్కరిస్తున్నారు. అల్లాహ్ ఏకత్వమును నిరూపించే స్పష్టమై ఆయతులు ఉన్నా కూడా వారు సత్యం నుండి ఏ విదంగా మరలిపోతున్నారో మరల మీరు యోచనతో దృష్టిని సారించండి.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి