సూరా 5 · జుజ్ 6
Al-Ma'idah · 5:73
لَقَدْ كَفَرَ الَّذِينَ قَالُوا إِنَّ اللَّهَ ثَالِثُ ثَلَاثَةٍ ۘ وَمَا مِنْ إِلَٰهٍ إِلَّا إِلَٰهٌ وَاحِدٌ ۚ وَإِنْ لَمْ يَنْتَهُوا عَمَّا يَقُولُونَ لَيَمَسَّنَّ الَّذِينَ كَفَرُوا مِنْهُمْ عَذَابٌ أَلِيمٌ
"నిశ్చయంగా, అల్లాహ్ ముగ్గురిలో మూడవవాడు!" అని అనేవారు వాస్తవానికి సత్యతిరస్కారులో. మరియు ఒకే ఒక్క ఆరాధ్యదేవుడు (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్యదేవుడు లేడు. మరియు వారు తమ ఈ మాటనలు మానుకోకపోతే, వారిలో సత్యతిరస్కారులైన వారికి బాధాకరమైన శిక్ష పడుతుంది.
తఫ్సీర్
"అల్లాహ్ అంటే ముగ్గురి కలయిక, తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ” అని పలికే వారు (క్రైస్తవులు) నిశ్చయంగా అవిశ్వాసపరులైపోయారు. వారి ఈ మాటకంటే అల్లాహ్ ఎంతో ఉన్నతుడు. అల్లాహ్ అనేకుల సమ్మేళనం కాదు. ఆయన ఏకైకుడు. నిశ్చయంగా ఆయన ఎటువంటి సాటి లేని ఒకే ఆరాధ్య దైవము. ఈ భయంకరమైన మాటలను విడనాడక పోతే వారికి బాధాకరమైన శిక్ష చేరుతుంది.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి