సూరా 5 · జుజ్ 6

Al-Ma'idah · 5:64

وَقَالَتِ الْيَهُودُ يَدُ اللَّهِ مَغْلُولَةٌ ۚ غُلَّتْ أَيْدِيهِمْ وَلُعِنُوا بِمَا قَالُوا ۘ بَلْ يَدَاهُ مَبْسُوطَتَانِ يُنْفِقُ كَيْفَ يَشَاءُ ۚ وَلَيَزِيدَنَّ كَثِيرًا مِنْهُمْ مَا أُنْزِلَ إِلَيْكَ مِنْ رَبِّكَ طُغْيَانًا وَكُفْرًا ۚ وَأَلْقَيْنَا بَيْنَهُمُ الْعَدَاوَةَ وَالْبَغْضَاءَ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ ۚ كُلَّمَا أَوْقَدُوا نَارًا لِلْحَرْبِ أَطْفَأَهَا اللَّهُ ۚ وَيَسْعَوْنَ فِي الْأَرْضِ فَسَادًا ۚ وَاللَّهُ لَا يُحِبُّ الْمُفْسِدِينَ

మరియు యూదులు: "అల్లాహ్ చేతులకు సంకెళ్ళు పడి ఉన్నాయి." అని అంటారు. వారి చేతులకే సంకెళ్ళు వేయబడుగాక! మరియు వారు పలికిన దానికి వారు శపించబడుగాక! వాస్తవానికి ఆయన (అల్లాహ్) రెండు చేతులు విస్తరింపబడి ఉన్నాయి; ఆయన (తన అనుగ్రహాలను) తాను కోరినట్లు ఖర్చు చేస్తాడు. మరియు (ఓ ప్రవక్తా!) నీ ప్రభువు తరపు నుండి నీపై అవతరింపజేయబడినది (ఈ గ్రంథం) నిశ్చయంగా, వారిలో చాలా మందికి తలబిరుసుతనం మరియు సత్య తిరస్కారాన్ని మాత్రమే పెంచుతున్నది. మరియు మేము వారి మధ్య విరోధాన్ని మరియు ద్వేషాన్ని, తీర్పుదినం వరకు ఉండేటట్లు చేశాము. వారు యుద్ధ జ్వాలలను ప్రజ్వలింపజేసినపుడల్లా, అల్లాహ్ దానిని చల్లార్చాడు. మరియు వారు భూమిలో కల్లోలం రేకెత్తించటానికి పాటు పడుతున్నారు. మరియు అల్లాహ్ కల్లోలం రేకెత్తించే వారిని ప్రేమించడు.

తఫ్సీర్

యూదులు వారికి కష్టము,లేమి కలిగినప్పుడు ఇలా పలికేవారు : మేలును ఖర్చు చేయటం,ప్రసాదించటం నుండి అల్లాహ్ చేయి కట్టబడి ఉంది. ఆయన వద్ద ఉన్న దాన్ని మాకు ఇవ్వటం నుండి ఆయన ఆపి ఉంచాడు. వినండి వారి ఈ మాట పలకటం వలన వారి చేతులు మేలుని చేయటం నుండి,ఇవ్వటం నుండి ఆగిపోవుగాక మరియు వారు అల్లాహ్ కారుణ్యం నుండి గెంటివేయబడుగాక. కాని పరిశుద్దుడైన,మహోన్నతుడైన అల్లాహ్ రెండు చేతులు మేలు చేయటంలో,ప్రసాదించటంలో విస్తరించి ఉన్నాయి. ఆయన ఎలా తలచుకుంటే అలా ఖర్చు చేస్తాడు. ఆయన విస్తరింపజేస్తాడు మరియు పిడికిలి బిగించివేస్తాడు. ఆయనపై అభ్యంతరం చేసేవాడెవడూ లేడు మరియు ఆయనకు బలవంతం చేసేవాడెవడూ లేడు. ఓ ప్రవక్తా మీపై అవతరింపబడినది యూదులకు హద్దును అతిక్రమించటం మరియు నిరాకరించటమును తప్ప దేనిని అధికం చేయలేదు. ఇది వారి అసూయ వలన. మరియు మేము యూదుల వర్గముల మధ్య శతృత్వమును,ద్వేషమును వేశాము. వారు ఎప్పుడైన యుద్ధం కొరకు సమావేశమై దాని కొరకు సిద్ధం అవుతారో లేదా దాన్ని మండించటానికి కుట్రలు పన్నుతారో అల్లాహ్ వారి సమూహమును వేరు చేశాడు. మరియు వారి బలమును తొలగించాడు. వారు ఇస్లామును తప్పు పట్టటానికి మరియు దాని కొరకు కుట్రలు పన్నటానికి క్రమం తప్పకుండా భూమిలో ఉపద్రవాలను తలపెట్టే విషయంలో ప్రయత్నాలు చేశారు. మరియు అల్లాహ్ ఉపద్రవాలను తలపెట్టేవారిని ఇష్టపడడు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి