సూరా 5 · జుజ్ 6
Al-Ma'idah · 5:63
لَوْلَا يَنْهَاهُمُ الرَّبَّانِيُّونَ وَالْأَحْبَارُ عَنْ قَوْلِهِمُ الْإِثْمَ وَأَكْلِهِمُ السُّحْتَ ۚ لَبِئْسَ مَا كَانُوا يَصْنَعُونَ
వారి ధర్మవేత్తలు (రబ్బానియ్యూన్) మరియు మతాచారులు (అహ్ బార్) వారిని, పాపపు మాటలు పలకటం నుండి మరియు నిషిద్ధమైన వాటిని తినటం నుండి ఎందుకు వారించరు? వారు చేసే కార్యాలు ఎంత నీచమైనవి!
తఫ్సీర్
ఎందుకని వారి ధర్మవేత్తలు మరియు మతాచారులు వారు త్వరపడుతున్న అబద్దం పలకటం,అబద్దపు సాక్ష్యమివ్వటం,అన్యాయంగా ప్రజల సొమ్మును తినటం నుండి వారిని వారించటంలేదు. వారిని చెడు నుండి వారించని వారి ధర్మవేత్తల,మతాచారుల చర్య ఎంతో చెడ్డదైనది.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి