సూరా 5 · జుజ్ 6
Al-Ma'idah · 5:6
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا قُمْتُمْ إِلَى الصَّلَاةِ فَاغْسِلُوا وُجُوهَكُمْ وَأَيْدِيَكُمْ إِلَى الْمَرَافِقِ وَامْسَحُوا بِرُءُوسِكُمْ وَأَرْجُلَكُمْ إِلَى الْكَعْبَيْنِ ۚ وَإِنْ كُنْتُمْ جُنُبًا فَاطَّهَّرُوا ۚ وَإِنْ كُنْتُمْ مَرْضَىٰ أَوْ عَلَىٰ سَفَرٍ أَوْ جَاءَ أَحَدٌ مِنْكُمْ مِنَ الْغَائِطِ أَوْ لَامَسْتُمُ النِّسَاءَ فَلَمْ تَجِدُوا مَاءً فَتَيَمَّمُوا صَعِيدًا طَيِّبًا فَامْسَحُوا بِوُجُوهِكُمْ وَأَيْدِيكُمْ مِنْهُ ۚ مَا يُرِيدُ اللَّهُ لِيَجْعَلَ عَلَيْكُمْ مِنْ حَرَجٍ وَلَٰكِنْ يُرِيدُ لِيُطَهِّرَكُمْ وَلِيُتِمَّ نِعْمَتَهُ عَلَيْكُمْ لَعَلَّكُمْ تَشْكُرُونَ
ఓ విశ్వాసులారా! మీరు నమాజ్ కు లేచి నపుడు, మీ ముఖాలను, మరియు మీ చేతులను మోచేతుల వరకు కడుక్కోండి. మరియు మీ తలలను (తడి చేతులతో) తుడుచుకోండి. మరియు మీ కాళ్ళను చీలమండల వరకు కడుక్కోండి. మరియు మీకు ఇంద్రియ స్ఖలనం (జునుబ్) అయి ఉంటే, స్నానం (గుస్ల్) చేయండి. మరియు మీరు అస్వస్థులై ఉన్నా, లేక ప్రయాణంలో ఉన్నా, లేక మీలో ఎవరైనా కాలకృత్యాలు తీర్చుకొని ఉన్నా, లేక మీరు స్త్రీలతో కలిసి (సంభోగం చేసి) ఉన్నా, అప్పుడు మీకు నీరు లభించని పక్షంలో పరిశుభ్రమైన మట్టితో తయమ్మమ్ చేయండి. అంటే మీ ముఖాలను మరియు మీ చేతులను, దానితో (పరిశుద్ధమైన మట్టిపై స్పర్శించిన చేతులతో) రుద్దుకోండి. మిమ్మల్ని కష్టపెట్టాలనేది అల్లాహ్ అభిమతం కాదు. మీరు కృతజ్ఞులు కావాలని ఆయన, మిమ్మల్ని శుద్ధపరచి మీపై తన అనుగ్రహాన్ని పూర్తి చేయగోరుతున్నాడు.
తఫ్సీర్
ఓ విశ్వాసపరులారా మీరు నమాజును పాటించటానికి నిలబడదలచుకున్నప్పుడు మీరు చిన్న అశుద్ధతలో ఉంటే మీరు మీ ముఖములను కడుగక్కొని మరియు మీ చేతులను వాటి మోచేతితోసహా కడుక్కొని మరియు మీ తలలపై మసహ్ చేసుకుని మీ కాళ్ళను కాలి జాయింట్ నుండి వెలుపలికి పొడుచుకుని వచ్చిన రెండ మడమలతో సహా కడుక్కొని వజూ చేసుకోండి. ఒక వేళ మీరు పెద్ద అశుద్ధావస్తలో ఉంటే గుసుల్ చేసుకోండి. మరియు ఒక వేళ మీరు అనారోగ్యముతో ఉండి రోగము పెరిగిపోతుందని లేదా దాని నయం అవటం ఆలస్యం అవుతుందని మీకు భయం ఉంటే లేదా మీరు ఆరోగ్యముగానే ఉండి ప్రయాణంలో ఉంటే లేదా మీరు కాలకృత్యముల్లాంటి చిన్న అశుద్ధతలో ఉంటే లేదా మీరు భార్యలతో సంభోగము చేయటం వలన పెద్ద అశుద్దతావస్తలో ఉంటే మరియు మీకు వెతికిన తరువాత కూడా పరిశుద్ధత పొందటానికి నీరు లభించకపోతే నేల పై భాగము వైపునకు మరలి దానిపై మీ రెండు చేతులతో కొట్టి దాన్ని మీ ముఖములపై మరియు మీ చేతులపై స్పర్శించుకోండి (మసాహ్ చేసుకోండి). మీకు నష్టం వైపునకు తీసుకుని వెళ్ళే నీటిని వినియోగించటం మీపై తప్పనిసరి చేసి అల్లాహ్ తన ఆదేశముల్లో మీపై కష్టమును వేయదలచుకోలేదు. అందుకనే ఆయన మీ కొరకు అనారోగ్యం వలన లేదా నీరు లభించకపోవటం వలన ఇబ్బంది కలిగినప్పుడు దానికి బదులును ధర్మబద్ధం చేశాడు తన అనుగ్రహమును మీపై పరిపూర్ణం చేయటానికి బహుశా మీరు మీపై ఉన్న అల్లాహ్ అనుగ్రహమునకు కృతజ్ఞత తెలుపుకుంటారని మరియు దానికి కృతఘ్నులు కారని.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి