సూరా 5 · జుజ్ 6
Al-Ma'idah · 5:5
الْيَوْمَ أُحِلَّ لَكُمُ الطَّيِّبَاتُ ۖ وَطَعَامُ الَّذِينَ أُوتُوا الْكِتَابَ حِلٌّ لَكُمْ وَطَعَامُكُمْ حِلٌّ لَهُمْ ۖ وَالْمُحْصَنَاتُ مِنَ الْمُؤْمِنَاتِ وَالْمُحْصَنَاتُ مِنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ مِنْ قَبْلِكُمْ إِذَا آتَيْتُمُوهُنَّ أُجُورَهُنَّ مُحْصِنِينَ غَيْرَ مُسَافِحِينَ وَلَا مُتَّخِذِي أَخْدَانٍ ۗ وَمَنْ يَكْفُرْ بِالْإِيمَانِ فَقَدْ حَبِطَ عَمَلُهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ
ఈనాడు మీ కొరకు పరిశుద్ధమైన వస్తువులన్నీ ధర్మసమ్మతం (హలాల్) చేయబడ్డాయి. మరియు గ్రంథ ప్రజల ఆహారం మీకు ధర్మ సమ్మతమైనది మరియు మీ ఆహారం వారికి ధర్మ సమ్మతమైనది. మరియు సుశీలురు అయిన విశ్వాస (ముస్లిం) స్త్రీలు గానీ మరియు సుశీలురు అయిన పూర్వ గ్రంథ ప్రజల స్త్రీలు గానీ, మీరు వారికి వారి మహ్ర్ చెల్లించి, న్యాయబద్ధంగా వారితో వివాహ జీవితం గడపండి. కాని వారితో స్వేచ్ఛా కామక్రీడలు గానీ, లేదా దొంగచాటు సంబంధాలు గానీ ఉంచుకోకండి. ఎవడు విశ్వాస మార్గాన్ని తిరస్కరిస్తాడో అతడి కర్మలు వ్యర్థమవుతాయి. మరియు అతడు పరలోకంలో నష్టం పొందేవారిలో చేరుతాడు.
తఫ్సీర్
ఈ రోజు అల్లాహ్ పరిశుద్ధమైన వాటిని తినటమును మరియు గ్రంధవహులైన యూదులు మరియు క్రైస్తవులు జుబాహ్ చేసిన వాటిని తినటమును మీ కొరకు సమ్మతం చేశాడు. మరియు ఆయన విశ్వాసపర స్త్రీలలోంచి స్వతంత్రులైన సౌశీలురైన స్త్రీలతో మరియు మీకన్నపూర్వం గ్రంధం ఇవ్వబడిన యూదుల,క్రైస్తవుల స్వతంత్రులైన సౌశీలురైన స్త్రీలతో మీరు వారికి వారి మహర్ ఇచ్చినప్పుడు నికాహ్ చేసుకోవటమును సమ్మతించాడు. మరియు మీరు వారితో వ్యభిచారమునకు పాల్పడునట్లు చేసే ప్రేమకలాపాలకు పాల్పడకుండా అశ్లీల కార్యములకు పాల్పడటం నుండి దూరంగా ఉండేవారై ఉండాలి. మరియు ఎవరైతే అల్లాహ్ తన దాసుల కొరకు ధర్మబద్ధం చేసిన ఆదేశములను తిరస్కరిస్తాడో అతడి కర్మ దాని షరతు అయిన విశ్వాసం లేకపోవటం వలన నిర్వార్యమైపోతుంది. మరియు అతడు ప్రళయదినమున నరకములో శాశ్వతంగా ఉండేటట్లుగా ప్రవేశించటం వలన నష్టం చవిచూసే వారిలో నుంచి అయిపోతాడు.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి