సూరా 5 · జుజ్ 6
Al-Ma'idah · 5:55
إِنَّمَا وَلِيُّكُمُ اللَّهُ وَرَسُولُهُ وَالَّذِينَ آمَنُوا الَّذِينَ يُقِيمُونَ الصَّلَاةَ وَيُؤْتُونَ الزَّكَاةَ وَهُمْ رَاكِعُونَ
నిశ్చయంగా, మీ స్నేహితులు, అల్లాహ్! ఆయన ప్రవక్త మరియు విశ్వసించిన వారు: ఎవరైతే నమాజ్ స్థాపిస్తారో, విధిదానం (జకాత్) ఇస్తూ ఉంటారో మరియు వారు (అల్లాహ్ ముందు) వంగుతూ (రుకూఉ చేస్తూ) ఉంటారో;
తఫ్సీర్
యూదులు గాని క్రైస్తవులు గాని ఇతర అవిశ్వాసపరులు గాని మీ స్నేహితులు కారు. నిశ్చయంగా మీ స్నేహితుడు మరియు మీకు సహాయకుడు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త మరియు నమాజులను పరిపూర్ణంగాపాటించే మరియు తమ సంపదల నుండి జకాత్ ను ఇచ్చే విశ్వాసపరులు. మరియు వారు అల్లాహ్ కొరకు నిమమ్రతతో వంగుతూ ఉంటారు.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి