సూరా 5 · జుజ్ 6
Al-Ma'idah · 5:54
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا مَنْ يَرْتَدَّ مِنْكُمْ عَنْ دِينِهِ فَسَوْفَ يَأْتِي اللَّهُ بِقَوْمٍ يُحِبُّهُمْ وَيُحِبُّونَهُ أَذِلَّةٍ عَلَى الْمُؤْمِنِينَ أَعِزَّةٍ عَلَى الْكَافِرِينَ يُجَاهِدُونَ فِي سَبِيلِ اللَّهِ وَلَا يَخَافُونَ لَوْمَةَ لَائِمٍ ۚ ذَٰلِكَ فَضْلُ اللَّهِ يُؤْتِيهِ مَنْ يَشَاءُ ۚ وَاللَّهُ وَاسِعٌ عَلِيمٌ
ఓ విశ్వాసులారా! మీలో ఎవడైనా తన ధర్మం (ఇస్లాం) నుండి వైదొలగితే, అల్లాహ్ త్వరలోనే ఇతర ప్రజలను తేగలడు. ఆయన వారిని ప్రేమిస్తాడు మరియు వారు ఆయన (అల్లాహ్) ను ప్రేమిస్తారు. వారు విశ్వాసుల పట్ల మృదువుగా, సత్యతిరస్కారుల పట్ల కఠినంగా ప్రవర్తించే వారునూ, అల్లాహ్ మార్గంలో ధర్మపోరాటం చేసే వారూను మరియు నిందించే వారి నిందలకు భయపడని వారూనూ, అయి ఉంటారు. ఇది అల్లాహ్ అనుగ్రహం, ఆయన దానిని తాను కోరిన వారికి ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ సర్వోపగతుడు (సర్వవ్యాప్తి), సర్వజ్ఞుడు.
తఫ్సీర్
ఓ విశ్వాసపరులారా మీలో నుండి ఎవరైన తన ధర్మము నుండి అవిశ్వాసం వైపునకు మరలితే తొందరలోనే అల్లాహ్ వారికి బదులుగా ఇతర జనులను తీసుకుని వస్తాడు వారిని ఆయన ఇష్టపడుతాడు వారు ఆయనను ఇష్టపడుతారు ఎందుకంటే వారిలో స్థిరత్వం ఉంటుంది,వారు విశ్వాసపరులపై దయ కలిగిన వారై అవిశ్వాసపరులపై కాఠిన్యమును కలిగినవారై ఉంటారు. వారు అల్లాహ్ కలిమా ఉన్నత శిఖరాలకు చేరటానికి తమ సంపదల ద్వారా మరియు తమ ప్రాణముల ద్వారా పోరాడుతారు. వారు తమను నిందించే వారి నిందల నుండి భయపడరు. ఎందుకంటే వారు సృష్టిరాసుల యొక్క మన్నతుపై అల్లాహ్ యొక్క మన్నతను ప్రాధాన్యతనిచ్చి ఉంటారు. ఇది అల్లాహ్ అనుగ్రహము దాన్ని ఆయన తన దాసుల్లోంచి తాను తలచిన వారికి ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ విశాలమైన అనుగ్రహము,ఉపకారమును కలిగినవాడు. తన అనుగ్రహమునకు ఎవరు హక్కుదారుడో బాగా తెలిసిన వాడు దాన్ని అతడికే ప్రసాదిస్తాడు. దానికి ఎవరు హక్కుదారుడు కాడో దాని నుండి దూరం చేస్తాడు.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి