సూరా 5 · జుజ్ 6

Al-Ma'idah · 5:13

فَبِمَا نَقْضِهِمْ مِيثَاقَهُمْ لَعَنَّاهُمْ وَجَعَلْنَا قُلُوبَهُمْ قَاسِيَةً ۖ يُحَرِّفُونَ الْكَلِمَ عَنْ مَوَاضِعِهِ ۙ وَنَسُوا حَظًّا مِمَّا ذُكِّرُوا بِهِ ۚ وَلَا تَزَالُ تَطَّلِعُ عَلَىٰ خَائِنَةٍ مِنْهُمْ إِلَّا قَلِيلًا مِنْهُمْ ۖ فَاعْفُ عَنْهُمْ وَاصْفَحْ ۚ إِنَّ اللَّهَ يُحِبُّ الْمُحْسِنِينَ

ఆ పిదప వారు తాము చేసిన ఒడంబడికను భంగం చేసినందుకు, మేము వారిని శపించాము (బహిష్కరించాము) మరియు వారి హృదయాలను కఠినం చేశాము. వారు పదాలను తారుమారు చేసి వాటి అర్థాన్ని, సందర్భాన్ని పూర్తిగా మార్చి వేసేవారు. వారికి ఇవ్వబడిన బోధనలలో అధిక భాగాన్ని మరచిపోయారు. అనుదినం వారిలో ఏ కొందరో తప్ప, పలువురు చేసే ద్రోహాన్ని గురించి నీకు తెలుస్తూనే ఉంది. కనుక వారిని మన్నించు మరియు వారి చేష్టలను ఉపేక్షించు. నిశ్చయంగా అల్లాహ్ సజ్జనులను ప్రేమిస్తాడు.

తఫ్సీర్

వారితో తీసుకోబడిన ప్రమాణమును వారు భంగపరచటం వలన మేము వారిని మా కారుణ్యము నుండి గెంటివేశాము. మరియు వారి హృదయములను గట్టిగా,కఠినంగా చేశాము వాటికి మేలు అన్నది చేరదు. మరియు వాటికి హితోపదేశం ప్రయోజనం కలిగించదు. వారు మాటలను వాటి పదములను మార్చి మరియు వాటి అర్ధాలను తమ మనోవాంఛలకు అనుగుణంగా మార్చి వేసి వాటి స్థానముల నుండి తారుమారు చేసేవారు. మరియు వారు తమకు బోధించబడిన వాటిలో నుండి కొన్నింటిని ఆచరించటం వదిలివేశారు. ఓ ప్రవక్తా అల్లాహ్ విషయంలో మరియు ఆయన విశ్వాసపర దాసుల విషయంలో వారి అవినీతి మీకు అనునిత్యం బట్బయలు అవుతునే ఉంది. కాని వారిలో నుండి కొంత మంది తమతో తీసుకున్న ప్రమాణమును పూర్తి చేశారు. కావున వారిని మీరు మన్నించండి మరియు వారిని శిక్షించకండి. వారిని క్షమించి వేయండి. నిశ్ఛయంగా ఇది ఉపకారము. మరియు అల్లాహ్ ఉపకారము చేసేవారిని ఇష్టపడుతాడు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి