సూరా 5 · జుజ్ 6

Al-Ma'idah · 5:12

۞ وَلَقَدْ أَخَذَ اللَّهُ مِيثَاقَ بَنِي إِسْرَائِيلَ وَبَعَثْنَا مِنْهُمُ اثْنَيْ عَشَرَ نَقِيبًا ۖ وَقَالَ اللَّهُ إِنِّي مَعَكُمْ ۖ لَئِنْ أَقَمْتُمُ الصَّلَاةَ وَآتَيْتُمُ الزَّكَاةَ وَآمَنْتُمْ بِرُسُلِي وَعَزَّرْتُمُوهُمْ وَأَقْرَضْتُمُ اللَّهَ قَرْضًا حَسَنًا لَأُكَفِّرَنَّ عَنْكُمْ سَيِّئَاتِكُمْ وَلَأُدْخِلَنَّكُمْ جَنَّاتٍ تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ ۚ فَمَنْ كَفَرَ بَعْدَ ذَٰلِكَ مِنْكُمْ فَقَدْ ضَلَّ سَوَاءَ السَّبِيلِ

మరియు వాస్తవానికి అల్లాహ్ ఇస్రాయీలు సంతతి వారి నుండి దృఢమైన ప్రమాణాన్ని తీసుకున్నాడు. మరియు మేము వారిలో నుండి పన్నెండు మందిని (కనాన్ కు) పోవటానికి నాయకులుగా నియమించాము. మరియు అల్లాహ్ వారితో ఇలా అన్నాడు: "ఒకవేళ మీరు నమాజ్ స్థిరంగా సలుపుతూ, విధి దానం (జకాత్) చెల్లిస్తూ మరియు నా ప్రవక్తలను విశ్వసించి వారికి తోడ్పడుతూ, అల్లాహ్ కు మంచి రుణాన్ని ఇస్తూ వుంటే! నిశ్చయంగా, నేను మీకు తోడుగా ఉంటాను. మరియు నిశ్చయంగా, నేను మీ నుండి మీ పాపాలను తొలగిస్తాను మరియు నిశ్చయంగా మిమ్మల్ని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాను. కానీ, దీని తరువాత మీలో ఎవడు సత్యతిరస్కార వైఖరిని అవలంబిస్తాడో! అతడు వాస్తవంగా, సరైన మార్గం నుండి తప్పి పోయిన వాడే!"

తఫ్సీర్

మరియు నిశ్చయంగా అల్లాహ్ ఇస్రాయీలు సంతతివారితో దృఢమైన ప్రమాణమును దగ్గరలోనే ప్రస్తావన వచ్చే వాటితో తీసుకున్నాడు. మరియు వారిపై పన్నెండు మంది నాయకులను నియమించాడు. ప్రతీ నాయకుడు తన ఆదీనంలో ఉన్న వారిపై పర్యవేక్షకుడిగా ఉంటాడు. మరియు అల్లాహ్ ఇస్రాయీలు సంతతివారితో ఇలా పలికాడు : నిశ్చయంగా మీరు నమాజును పరిపూర్ణ పద్దతిలో పాటించి,మీ సంపదల నుండి జకాత్ ను చెల్లించి,నా ప్రవక్తలందరిని వారి మధ్య ఎటువంటి బేధబావం లేకుండా విశ్వసించి ,వారిని గౌరవించి,వారికి సహాయం చేసి మరియు మంచి మార్గముల్లో మీరు ఖర్చు చేసినప్పుడు నేను సహాయముతో మరియు మద్దతుతో మీకు తోడుగా ఉంటాను. మీరు వీటన్నింటిని నెలకొల్పినప్పుడు నేను మీరు పాల్పడిన పాపములన్నింటిని మీ నుండి ప్రక్షాళన చేస్తాను. మరియు ప్రళయదినమున మిమ్మల్ని నేను స్వర్గవనముల్లో ప్రవేశింపజేస్తాను వాటి భవనముల క్రింది నుండి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. ఎవరైతే ఈ దృఢప్రమాణమును తీసుకున్న తరువాత అవిశ్వసిస్తాడో అతడు తెలిసి ఉద్దేశపూర్వకంగా సత్య మార్గము నుండి మరలిపోయాడు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి