సూరా 41 · జుజ్ 25

Fussilat · 41:47

۞ إِلَيْهِ يُرَدُّ عِلْمُ السَّاعَةِ ۚ وَمَا تَخْرُجُ مِنْ ثَمَرَاتٍ مِنْ أَكْمَامِهَا وَمَا تَحْمِلُ مِنْ أُنْثَىٰ وَلَا تَضَعُ إِلَّا بِعِلْمِهِ ۚ وَيَوْمَ يُنَادِيهِمْ أَيْنَ شُرَكَائِي قَالُوا آذَنَّاكَ مَا مِنَّا مِنْ شَهِيدٍ

ఆ (అంతిమ) ఘడియ జ్ఞానం కేవలం ఆయనకే చెందినది. మరియు ఆయనకు తెలియకుండా ఫలాలు పుష్పకోశాల నుండి బయటికి రావు మరియు ఆయనకు తెలియకుండా ఏ స్త్రీ కూడా గర్భం దాల్చదు మరియు ప్రసవించదు. మరియు ఏ దినమునైతే వారిని పిలిచి: "మీరు నాకు సాటి కల్పించే ఆ భాగస్వాములు ఎక్కడున్నారు?" అని అడిగితే,వారు ఇలా జవాబిస్తారు: "మాలో ఎవ్వడు కూడా దీనికి సాక్ష్యం ఇచ్చేవాడు లేడని మేము ఇది వరకే మనవి చేసుకున్నాము!"

తఫ్సీర్

అల్లాహ్ ఒక్కడి వైపునకే ప్రళయం యొక్క జ్ఞానము మరలించబడుతుంది. అది ఎప్పుడు వాటిల్లుతుందో ఆయన ఒక్కడికే తెలుసు. ఆయన తప్ప ఇంకెవరికి దాని గురించి తెలియదు. మరియు ఫలాలు వాటిని పరిరక్షించే వాటి గుబురు గలీబు నుంచి బయటకు రావటంగాని,ఏ ఆడదీ గర్భం దాల్చటంగానీ,ప్రసవించటంగాని ఆయన జ్ఞానముతోనే జరుగును. వాటిలో నుంచి ఏదీ ఆయన నుండి తప్పి పోదు. మరియు ఆ రోజు అల్లాహ్ తనతో పాటు విగ్రహాలను ఆరాధించే ముష్రికులను వారి ఆరాధన చేయటముపై మందలిస్తూ ఇలా ప్రకటిస్తాడు : భాగస్వాములు ఉన్నారని మీరు ఆరోపించిన నా భాగస్వాములు ఎక్కడ ?. ముష్రికులు ఇలా సమాధానమిస్తారు : మేము నీ ముందు అంగీకరిస్తాము. నీకు ఎటువంటి భాగస్వామి ఉన్నాడని మాలో నుండి ఎవరూ ఇప్పుడు సాక్ష్యం పలకరు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి