సూరా 41 · జుజ్ 24
Fussilat · 41:44
وَلَوْ جَعَلْنَاهُ قُرْآنًا أَعْجَمِيًّا لَقَالُوا لَوْلَا فُصِّلَتْ آيَاتُهُ ۖ أَأَعْجَمِيٌّ وَعَرَبِيٌّ ۗ قُلْ هُوَ لِلَّذِينَ آمَنُوا هُدًى وَشِفَاءٌ ۖ وَالَّذِينَ لَا يُؤْمِنُونَ فِي آذَانِهِمْ وَقْرٌ وَهُوَ عَلَيْهِمْ عَمًى ۚ أُولَٰئِكَ يُنَادَوْنَ مِنْ مَكَانٍ بَعِيدٍ
ఒకవేళ మేము ఈ ఖుర్ఆన్ ను అరబ్బేతర భాషలో అవతరింప జేసి ఉండి నట్లైతే వారు ఇలా అని ఉండేవారు: "దీని సూచనలు (ఆయాత్) స్పష్టంగా ఎందుకు వివరించబడలేదు? (గ్రంథమేమో) అరబ్బేతర భాషలో మరియు (సందేశహరుడేమో) అరబ్బు?" వారితో ఇలా అను: "ఇది (ఈ ఖుర్ఆన్) విశ్వసించిన వారికి మార్గదర్శకత్వం మరియు స్వస్థత నొసంగేది. మరియు విశ్వసించనివారి చెవులకు అవరోధం మరియు వారి కళ్ళకు ఒక గంత. అలాంటి వారి స్థితి ఎంతో దూరం నుండి పిలువబడిన వారి అరుపులాంటిది!"
తఫ్సీర్
మరియు ఒక వేళ మేము ఈ ఖుర్ఆన్ ను అరబ్బేతర భాషలో అవతరింపజేసి ఉంటే వారిలో నుండి అవిశ్వాసపరులు ఇలా పలుకుతారు : దాని ఆయతులు మేము వాటిని అర్ధం చేసుకొనటానికి ఎందుకని స్పష్టపరచబడలేదు. ఏమీ ఖుర్ఆన్ అరబ్బేతర (పరాయి) భాషలో ఉండి,దాన్ని తీసుకుని వచ్చిన వాడు అరబీ వాడవుతాడా ?. ఓ ప్రవక్తా వారందరితో ఇలా పలకండి : ఈ ఖుర్ఆన్ అల్లాహ్ ను విశ్వసించి,ఆయన ప్రవక్తలను నిజమని విశ్వసించిన వారికి అపమార్గము నుండి సన్మార్గమును చూపించేది మరియు హృదయముల్లోకల అజ్ఞానత,దాని వెనుక వచ్చే వాటి నుండి నయం చేసేది. మరియు అల్లాహ్ ను విశ్వసించని వారి చెవుల్లో చెవుడు కలదు. మరియు అది వారిపై అంధత్వంగా పరిణమించింది వారు దాన్ని అర్ధం చేసుకోలేరు. ఈ గుణాలతో వర్ణించబడిన వారందరు దూర ప్రదేశము నుండి పిలవబడే లాంటివారు. అటువంటప్పుడు పిలిచే వ్యక్తి స్వరము వారికి వినటం ఎలా సాధ్యమగును.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి