సూరా 4 · జుజ్ 5

An-Nisa · 4:86

وَإِذَا حُيِّيتُمْ بِتَحِيَّةٍ فَحَيُّوا بِأَحْسَنَ مِنْهَا أَوْ رُدُّوهَا ۗ إِنَّ اللَّهَ كَانَ عَلَىٰ كُلِّ شَيْءٍ حَسِيبًا

మరియు మీకు ఎవరైనా సలాం చేస్తే, దానికి మీరు అంతకంటే ఉత్తమమైన రీతిలో ప్రతి సలాం చెయ్యండి లేదా కనీసం అవే పదాలు తిరిగి పలకండి (అదే విధంగానైనా చెయ్యండి). నిశ్చయంగా, అల్లాహ్ ప్రతి దానిని పరిగణించగలవాడు.

తఫ్సీర్

మీకు ఎవరైన సలాం చేసినప్పుడు అతను మీకు సలాం చేసిన దాని కన్న ఉత్తమ రీతిలో అతనికి ప్రతిసలాం చేయండి లేదా అతను పలికిన విధంగా అతనికి ప్రతిసలాం చేయండి. మరియు ఉత్తమరీతిలో ప్రతిసలాం చేయటం మంచిది. నిశ్చయంగా అల్లాహ్ మీరు చేసే కార్యాలపై సంరక్షకుడు. మరియు ఆయన ప్రతి ఒక్కరికి అతని కర్మపరంగా ప్రతిఫలం ప్రసాదిస్తాడు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి