సూరా 4 · జుజ్ 5

An-Nisa · 4:85

مَنْ يَشْفَعْ شَفَاعَةً حَسَنَةً يَكُنْ لَهُ نَصِيبٌ مِنْهَا ۖ وَمَنْ يَشْفَعْ شَفَاعَةً سَيِّئَةً يَكُنْ لَهُ كِفْلٌ مِنْهَا ۗ وَكَانَ اللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ مُقِيتًا

మంచి విషయం కొరకు సిఫారసు చేసేవానికి అందులో భాగం లభిస్తుంది. మరియు చెడు విషయం కొరకు సిఫారసు చేసేవాడు దానికి బాధ్యత వహిస్తాడు. మరియు అల్లాహ్ ప్రతి దానిపై అధికారం గలవాడు.

తఫ్సీర్

ఎవరైతే ఇతరుల కొరకు మంచి తీసుకుని రావటానికి ప్రయత్నిస్తాడో అతని కొరకు పుణ్యంలో భాగముండును. మరియు ఎవరైతే ఇతరుల కొరకు కీడును తీసుకుని రావటానికి ప్రయత్నిస్తాడో అతని కొరకు పాపంలో భాగముండును. మరియు మనిషి చేసే ప్రతీ దానిపై అల్లాహ్ సాక్షిగా ఉంటాడు. మరియు తొందరలోనే దాని ప్రకారంగా అతనికి ప్రతిఫలం ప్రసాదిస్తాడు. అయితే మీలో నుండి ఎవరైతే మంచిని సాధించటంలో కారణం అవుతాడో అతని కొరకు అందులో భాగము,వంతు ఉంటుంది. మరియు ఎవరైతే చెడును సాధించటంలో కారణం అవుతాడో అతడు అందులో నుంచి ఏదైన పొందుతాడు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి