సూరా 4 · జుజ్ 5
An-Nisa · 4:76
الَّذِينَ آمَنُوا يُقَاتِلُونَ فِي سَبِيلِ اللَّهِ ۖ وَالَّذِينَ كَفَرُوا يُقَاتِلُونَ فِي سَبِيلِ الطَّاغُوتِ فَقَاتِلُوا أَوْلِيَاءَ الشَّيْطَانِ ۖ إِنَّ كَيْدَ الشَّيْطَانِ كَانَ ضَعِيفًا
విశ్వసించిన వారు, అల్లాహ్ మార్గంలో పోరాడుతారు. మరియు సత్యతిరస్కారులు తాగూత్ మార్గంలో పోరాడుతారు; కావున మీరు (ఓ విశ్వాసులారా!) షైతాను అనుచరులను విరుద్ధంగా పోరాడండి. నిశ్చయంగా, షైతాను కుట్ర బలహీనమైనదే!
తఫ్సీర్
సత్యసందులైన విశ్వాసపరులు అల్లాహ్ మార్గంలో ఆయన వాక్కును ఉన్నత శిఖరాలకు చేర్చటం కొరకు పోరాడుతారు. మరియు అవిశ్వాసపరులు తమ అసత్య దైవాల మార్గంలో పోరాడుతారు. కావున మీరు షైతాను యొక్క సహాయకులతో పోరాడండి. నిశ్చయంగా మీరు ఒక వేళ వారితో పోరాడితే మీరే వారిపై ఆధిక్యతను ప్రదర్శిస్తారు. ఎందుకంటే షైతాను యోచన బలహీనమైనది. అల్లాహ్ పై నమ్మకమును కలిగి ఉండేవారికి అది నష్టం కలిగించదు.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి