సూరా 4 · జుజ్ 5
An-Nisa · 4:75
وَمَا لَكُمْ لَا تُقَاتِلُونَ فِي سَبِيلِ اللَّهِ وَالْمُسْتَضْعَفِينَ مِنَ الرِّجَالِ وَالنِّسَاءِ وَالْوِلْدَانِ الَّذِينَ يَقُولُونَ رَبَّنَا أَخْرِجْنَا مِنْ هَٰذِهِ الْقَرْيَةِ الظَّالِمِ أَهْلُهَا وَاجْعَلْ لَنَا مِنْ لَدُنْكَ وَلِيًّا وَاجْعَلْ لَنَا مِنْ لَدُنْكَ نَصِيرًا
మరియు మీకేమయింది, మీరెందుకు అల్లాహ్ మార్గంలో మరియు నిస్సహాయులై అణచి వేయబడిన పురుషుల, స్త్రీల మరియు పిల్లల కొరకు, పోరాడటం లేదు? వారు: "మా ప్రభూ! దౌర్జన్యపరులైన ఈ నగరవాసుల నుండి మాకు విమోచనం కలిగించు. నీ వద్ద నుండి మా కొరకు ఒక సంరక్షకుణ్ణి నియమించు. మరియు నీ వద్ద నుండి మా కొరకు ఒక సహాయకుణ్ణి ఏర్పాటు చేయి!" అని వేడుకుంటున్నారు.
తఫ్సీర్
ఓ విశ్వాసపరులారా అల్లాహ్ వాక్కును ఉన్నత శిఖరాలకు చేర్చుటకు మరియు బలహీనులైన పురుషులు,స్త్రీలు మరియు పిల్లలకు ఎవరైతే ఇలా పలుకుతూ : ఓ మా ప్రభూ మక్కా నుండి మమ్మల్ని బయటకు తీయి అక్కడి వాసులు అల్లాహ్ కి సాటి కల్పించి,ఆయన దాసులపై హద్దుమీరి ప్రవర్తించి దుర్మార్గమునకు పాల్పడటం వలన,మరియు నీ వద్ద నుండి మా వ్యవహారమును దాక్షిణ్యం ద్వారా,పరిరక్షణ ద్వారా పరిరక్షించే వారిని,మా నుండి నష్టమును తొలగించే సహాయకుడిని నియమించు అని అల్లాహ్ తో వేడుకుంటున్నారో వారికి విముక్తి కలిగించటం కొరకు ఆయన మార్గంలో ధర్మపోరాటం చేయటం నుండి మిమ్మల్ని ఏది ఆపుతుంది.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి