సూరా 4 · జుజ్ 5

An-Nisa · 4:61

وَإِذَا قِيلَ لَهُمْ تَعَالَوْا إِلَىٰ مَا أَنْزَلَ اللَّهُ وَإِلَى الرَّسُولِ رَأَيْتَ الْمُنَافِقِينَ يَصُدُّونَ عَنْكَ صُدُودًا

మరియు వారితో: "అల్లాహ్ అవతరింపజేసిన వాటి (ఆదేశాల) వైపునకు మరియు ప్రవక్త వైపునకు రండి." అని చెప్పినపుడు, నీవు ఆ కపట విశ్వాసులను విముఖులై (నీ వైపునకు రాకుండా) తొలిగి పోవటాన్ని చూస్తావు!

తఫ్సీర్

మరియు ఈ కపటులందరితో మీరు అల్లాహ్ తన గ్రంధంలో అవతరించిన ఆదేశం మరియు ప్రవక్త వైపునకు రండి మీ తగాదాల్లో మీ మధ్య ఆయన తీర్పు ఇవ్వటానికి అని పలకబడినప్పుడు. ఓ ప్రవక్తా మీరు వారిని చూస్తారు వారు మీ నుండి పూర్తిగా విముఖత చూపి తీర్పు కొరకు ఇతరుల వద్దకు వెళ్ళిపోతారు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి