సూరా 4 · జుజ్ 5
An-Nisa · 4:60
أَلَمْ تَرَ إِلَى الَّذِينَ يَزْعُمُونَ أَنَّهُمْ آمَنُوا بِمَا أُنْزِلَ إِلَيْكَ وَمَا أُنْزِلَ مِنْ قَبْلِكَ يُرِيدُونَ أَنْ يَتَحَاكَمُوا إِلَى الطَّاغُوتِ وَقَدْ أُمِرُوا أَنْ يَكْفُرُوا بِهِ وَيُرِيدُ الشَّيْطَانُ أَنْ يُضِلَّهُمْ ضَلَالًا بَعِيدًا
(ఓ ప్రవక్తా!) ఏమీ? నీ వద్దకు పంపబడిన దానిని మరియు నీ కంటే పూర్వం పంపబడిన దానిని మేము విశ్వసించామని పలికే వారిని (కపట విశ్వాసులను) నీవు ఎరుగవా (చూడలేదా)? తిరస్కరించండని ఆదేశింపబడినా, వారు తమ (వ్యవహారాల) పరిష్కారాలకు తాగూత్ వద్దకే పోవాలని కోరుతూ ఉంటారు. మరియు షైతాన్ వారిని, త్రోవ తప్పించి, దుర్మార్గంలో అతి దూరంగా తీసుకొని పోవాలని కోరుతుంటాడు.
తఫ్సీర్
ఓ ప్రవక్త మీపై మరియు మీ కన్న పూర్వ ప్రవక్తలపై అవతరింపబడిన దాన్ని విశ్వసించామని అబద్దము పలికే యూద కపటుల వైరుధ్యమును మీరు చూడలేదా. వారు తమ తగాదాల్లో మానవుడు తయారు చేసుకున్న అల్లాహ్ ధర్మబద్ధం చేయని వాటి ద్వారా విచారణ జరగాలని కోరుకుంటున్నారు. వాస్తవానికి వారు దాన్ని తిరస్కరించాలని ఆదేశించబడ్డారు. మరియు షైతాను వారు సన్మార్గం పొందకుండా సత్యము నుండి చాలా దూరం వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాడు.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి