సూరా 4 · జుజ్ 5

An-Nisa · 4:34

الرِّجَالُ قَوَّامُونَ عَلَى النِّسَاءِ بِمَا فَضَّلَ اللَّهُ بَعْضَهُمْ عَلَىٰ بَعْضٍ وَبِمَا أَنْفَقُوا مِنْ أَمْوَالِهِمْ ۚ فَالصَّالِحَاتُ قَانِتَاتٌ حَافِظَاتٌ لِلْغَيْبِ بِمَا حَفِظَ اللَّهُ ۚ وَاللَّاتِي تَخَافُونَ نُشُوزَهُنَّ فَعِظُوهُنَّ وَاهْجُرُوهُنَّ فِي الْمَضَاجِعِ وَاضْرِبُوهُنَّ ۖ فَإِنْ أَطَعْنَكُمْ فَلَا تَبْغُوا عَلَيْهِنَّ سَبِيلًا ۗ إِنَّ اللَّهَ كَانَ عَلِيًّا كَبِيرًا

పురుషులు స్త్రీలపై నిర్వాహకులు (ఖవ్వామూన్), ఎందుకంటే అల్లాహ్ కొందరికి మరికొందరిపై ఘనత నిచ్చాడు మరియు వారు (పురుషులు) తమ సంపదలో నుండి వారిపై (స్త్రీలపై) ఖర్చు చేస్తారు. కావున సుగుణవంతులైన స్త్రీలు విధేయవతులై ఉండి, భర్తలు లేనప్పుడు, అల్లాహ్ కాపాడమని ఆజ్ఞాపించిన దానిని (శీలమును) కాపాడుకుంటారు. కానీ అవిధేయత చూపుతారని మీకు భయముంటే, వారికి (మొదట) నచ్చజెప్పండి, (తరువాత) పడకలో వేరుగా ఉంచండి, (ఆ తరువాత కూడా వారు విధేయులు కాకపోతే) వారిని (మెల్లగా) కొట్టండి. కాని వారు మీకు విధేయులై ఉంటే! వారిని నిందించటానికి మార్గం వెతకకండి. నిశ్చయంగా, అల్లాహ్ మహోన్నతుడు, మహనీయుడు.

తఫ్సీర్

పురుషులు స్త్రీలను పరిరక్షిస్తారు. మరియు వారి వ్యవహారములను పరిరక్షిస్తారు. ఏదైతే అనుగ్రహమును వారిపై వారికి ప్రత్యేకించాడో దాని వలన మరియు వారికి వారి విషయంలో ఖర్చు చేసే మరియు వారి పరిరక్షణ బాధ్యత వారిపై అనివార్యం అవటం వలన. మరియు స్త్రీల్లోంచి పుణ్యాత్ములైనవారు తమ ప్రభువుకు విధేయిలై ఉంటారు మరియు తమ భర్తలకు విధేయులై ఉంటారు. వారికి అల్లాహ్ భాగ్యము కలిగి ఉండటం వలన వారు వారి గైర్ హాజరీలో వారి కొరకు పరిరక్షిస్తారు. మరియు ఏ స్త్రీల గురించి మాటలో లేదా చేతలో వారి భర్తల విధేయత నుండి వారి అహం భయం మీకు ఉంటే ఓ భర్తల్లారా మీరు వారికి హితబోధన చేయటమును మరియు వారిని అల్లాహ్ నుండి భయపెట్టటమును మొదలెట్టండి. ఒక వేళ వారు మాట వినకపోతే పడకల్లో వారిని వదిలివేయండి వారి నుండి వీపును త్రిప్పి వారితో సంభోగం చేయకుండా ఉండటం ద్వారా. ఒక వేళ వారు మాట వినకపోతే వారిని గాయపరచకుండా కొట్టండి. ఒక వేళ వారు విధేయత వైపుకు మరలితే వారిపై ఎటువంటి హింస ద్వారా లేదా శిక్ష ద్వారా హద్దుమీరకండి. నిశ్చయంగా అల్లాహ్ ప్రతీ వస్తువుకన్న ఉన్నతుడు,తన అస్తిత్వంలో మరియు తన గుణాల్లో గొప్పవాడు కాబట్టి మీరు ఆయనకు భయపడండి.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి