సూరా 4 · జుజ్ 5

An-Nisa · 4:33

وَلِكُلٍّ جَعَلْنَا مَوَالِيَ مِمَّا تَرَكَ الْوَالِدَانِ وَالْأَقْرَبُونَ ۚ وَالَّذِينَ عَقَدَتْ أَيْمَانُكُمْ فَآتُوهُمْ نَصِيبَهُمْ ۚ إِنَّ اللَّهَ كَانَ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدًا

మరియు తల్లిదండ్రులు మరియు దగ్గరి బంధువులు, వదలి పోయిన ప్రతి వ్యక్తి (ఆస్తి)కి మేము వారసులను నియమించి ఉన్నాము. మరియు మీరు ఎవరితో ప్రమాణ పూర్వక ఒప్పందాలను చేసుకొని ఉన్నారో! వారి భాగాన్ని వారికి ఇచ్చి వేయండి. నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదానికి సాక్షిగా ఉంటాడు.

తఫ్సీర్

మరియు మేము మీలో నుండి ప్రతి ఒక్కరి కొరకు అసబహ్ ను చేశాము వారు తల్లిదండ్రులు మరియు దగ్గరి బందువులు వదిలి వెళ్ళిన అస్తిలో వారసులవుతారు. మరియు మీరు ఎవరితోనైతే ఒప్పందముపై,సహాయముపై దృఢమైన ప్రమాణము చేసి ఉంటే మీరు వారికి వారసత్వ సొమ్ములో వారి భాగమును ఇవ్వండి. నిశ్చయంగా అల్లాహ్ ప్రతీ వస్తువుపై సాక్షిగా ఉన్నాడు. మీ ఈ ప్రమాణములపై మరియు మీ ఒప్పందములపై ఆయన సాక్ష్యం అందులో నుంచే. ఒప్పందము ద్వారా వారసులవ్వటం ఇస్లాం ఆరంభంలో ఉండేది. ఆ తరువాత అది రద్దుపరచబడినది.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి