సూరా 4 · జుజ్ 6

An-Nisa · 4:159

وَإِنْ مِنْ أَهْلِ الْكِتَابِ إِلَّا لَيُؤْمِنَنَّ بِهِ قَبْلَ مَوْتِهِ ۖ وَيَوْمَ الْقِيَامَةِ يَكُونُ عَلَيْهِمْ شَهِيدًا

మరియు గ్రంథ ప్రజల్లో ఎవడు కూడా అతనిని (ఈసాను), అతని మరణానికి పూర్వం (అతను, అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ఒక మానవుడని), విశ్వసించకుండా ఉండడు. మరియు పునరుత్థాన దినమున అతను (ఈసా) వారిపై సాక్షిగా ఉంటాడు.

తఫ్సీర్

గ్రంధవహుల్లోంచి ఏ ఒక్కడు కూడా ఈసా అలైహిస్సలాంను చివరి కాలంలో ఆయన దిగిన తరువాత,ఆయన మరణం కన్న ముందు విశ్వసించకుండా ఉండరు. మరియు ప్రళయదినమున ఈసా అలైహిస్సలాం వారి కర్మలపై వాటిలో నుండి ఏవైతే ధర్మానికి అనుగుణంగా ఉంటాయో మరియు ఏవైతే వ్యతిరేకంగా ఉంటాయో సాక్షిగా ఉంటారు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి