సూరా 39 · జుజ్ 23

Az-Zumar · 39:7

إِنْ تَكْفُرُوا فَإِنَّ اللَّهَ غَنِيٌّ عَنْكُمْ ۖ وَلَا يَرْضَىٰ لِعِبَادِهِ الْكُفْرَ ۖ وَإِنْ تَشْكُرُوا يَرْضَهُ لَكُمْ ۗ وَلَا تَزِرُ وَازِرَةٌ وِزْرَ أُخْرَىٰ ۗ ثُمَّ إِلَىٰ رَبِّكُمْ مَرْجِعُكُمْ فَيُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُونَ ۚ إِنَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ

ఒకవేళ మీరు సత్యాన్ని తిరస్కరిస్తే, నిశ్చయంగా, అల్లాహ్ మీ అక్కరలేని వాడు. మరియు ఆయన తన దాసులు సత్యతిరస్కార వైఖరిని అవలంబించడాన్ని ఇష్ట పడడు. మరియు మీరు కృతజ్ఞులైనట్లయితే ఆయన మీ పట్ల ఎంతో సంతోషపడతాడు. మరియు బరువు మోసేవాడు ఎవ్వడూ ఇతరుల బరువును మోయడు. చివరకు మీరందరికీ, మీ ప్రభువు వైపునకే మరల వలసి ఉంది! అప్పుడు ఆయన, మీరు ఏమేమి చేస్తూ ఉండేవారో మీకు తెలియజేస్తాడు. నిశ్చయంగా ఆయనకు హృదయాలలో ఉన్న విషయాలన్నీ బాగా తెలుసు.

తఫ్సీర్

ఓ ప్రజలారా ఒక వేళ మీరు మీ ప్రభువు పట్ల అవిశ్వాసమును కనబరిస్తే నిశ్ఛయంగా అల్లాహ్ మీ విశ్వాసము అక్కర లేని వాడు. మరియు మీ అవిశ్వాసం ఆయనకు నష్టం కలిగించదు. మరియు మీ అవిశ్వాసము యొక్క నష్టము మీ వైపునకు మాత్రమే మరలుతుంది. మరియు ఆయన తన దాసుల కొరకు తనను అవిశ్వసించటమును ఇష్టపడడు. మరియు వారిని అవిశ్వసించమని ఆదేశించడు. ఎందుకంటే అల్లాహ్ అశ్లీలత గురించి,చెడు గురించి ఆదేశించడు. మరియు ఒక వేళ మీరు అల్లాహ్ కు ఆయన అనుగ్రహాలపై కృతజ్ఞత తెలిపి ఆయనపై విశ్వాసమును కనబరిస్తే ఆయన మీ కృతజ్ఞత నుండి సంతుష్టపడి మీకు దాని ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. మరియు ఒక ప్రాణం వేరే ప్రాణము యొక్క పాపమును మోయదు. అంతేకాదు ప్రతీ వ్యక్తి తాను చేసుకున్న దానికి ప్రతిగా తాకట్టుగా ఉంటాడు. ఆ తరువాత మీరు ప్రళయదినమున మీ మరలటం ఒక్కడైన మీ ప్రభువు వైపునకు జరుగును. అప్పుడు ఆయన ఇహలోకంలో మీరు చేసుకున్న కర్మల గురించి మీకు సమాచారమిస్తాడు. మరియు ఆయన మీ కర్మలపరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. నిశ్ఛయంగా పరిశుద్ధుడైన ఆయన తన దాసుల హృదయములలో ఉన్న వాటి గురించి బాగా తెలిసినవాడు. వాటిలో ఉన్నది ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి