సూరా 39 · జుజ్ 23

Az-Zumar · 39:6

خَلَقَكُمْ مِنْ نَفْسٍ وَاحِدَةٍ ثُمَّ جَعَلَ مِنْهَا زَوْجَهَا وَأَنْزَلَ لَكُمْ مِنَ الْأَنْعَامِ ثَمَانِيَةَ أَزْوَاجٍ ۚ يَخْلُقُكُمْ فِي بُطُونِ أُمَّهَاتِكُمْ خَلْقًا مِنْ بَعْدِ خَلْقٍ فِي ظُلُمَاتٍ ثَلَاثٍ ۚ ذَٰلِكُمُ اللَّهُ رَبُّكُمْ لَهُ الْمُلْكُ ۖ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ فَأَنَّىٰ تُصْرَفُونَ

ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి (ఆదమ్) నుండి సృష్టించాడు. తరువాత అతని నుండి అతని జంట (జౌజ్) ను పుట్టించాడు. మరియు మీ కొరకు ఎనిమిది జతల (ఆడ మగ) శిశువులను పుట్టించాడు. ఆయన మిమ్మల్ని మీ తల్లుల గర్భాలలో మూడు చీకటి తెరలలో ఒక రూపం తరువాత మరొక రూపాన్ని ఇచ్చాడు. ఆయనే అల్లాహ్! మీ ప్రభువు. విశ్వాధిపత్యం ఆయనదే. ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. అలాంటప్పుడు మీరు ఎలా (సత్యం నుండి) తప్పించబడుతున్నారు?

తఫ్సీర్

ఓ ప్రజలారా మీ ప్రభువు మిమ్మల్ని ఒకే ప్రాణమైన ఆదం నుండి సృష్టించాడు. ఆ తరువాత ఆదం నుండి ఆయన భార్య హవ్వాను సృష్టించాడు. మరియు ఆయన మీ కొరకు ఒంటెల నుండి,ఆవుల నుండి,గొర్రెల నుండి,మేకల నుండి ఎనిమిది రకముల వాటిని సృష్టించాడు. ప్రతీ రకము నుండి మగ,ఆడను సృష్టించాడు. పరిశుద్ధుడైన ఆయన మిమ్మల్ని మీ మాతృ గర్భములో ఒక దశ తరువాత ఇంకో దశను కడుపు,గర్భము,మావి (తల్లి గర్భములో శిసువుపై ఉండే పొర) యొక్క చీకట్లలో సృష్టించాడు. వాటన్నింటిని సృష్టించిన వాడే మీ ప్రభువైన అల్లాహ్. రాజ్యాధికారము ఆయన ఒక్కడికే చెందుతుంది. ఆయన తప్ప వాస్తవ ఆరాధ్య దైవం ఇంకొకడు లేడు. అటువంటప్పుడు మీరు ఎలా ఆయన ఆరాధన చేయటం నుండి ఏమీ సృష్టించకుండా తామే సృష్టించబడి వాటి ఆరాధన చేయటం వైపునకు మరలిపోతున్నారు ?!.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి