సూరా 33 · జుజ్ 21

Al-Ahzab · 33:7

وَإِذْ أَخَذْنَا مِنَ النَّبِيِّينَ مِيثَاقَهُمْ وَمِنْكَ وَمِنْ نُوحٍ وَإِبْرَاهِيمَ وَمُوسَىٰ وَعِيسَى ابْنِ مَرْيَمَ ۖ وَأَخَذْنَا مِنْهُمْ مِيثَاقًا غَلِيظًا

మరియు (జ్ఞాపకముంచుకో) వాస్తవానికి మేము ప్రవక్తలందరి నుండి వాగ్దానం తీసుకున్నాము మరియు నీతో (ఓ ముహమ్మద్), నూహ్ తో, ఇబ్రాహీమ్ తో, మూసాతో మరియు మర్యమ్ కుమారుడైన ఈసాతో కూడా! మరియు మేము వారందరి నుండి గట్టి వాగ్దానం తీసుకున్నాము.

తఫ్సీర్

ఓ ప్రవక్తా మేము ప్రవక్తలందరితో వారు అల్లాహ్ ఒక్కడినే ఆరాధించమని,ఆయనతోపాటు దేనినీ సాటి కల్పించకండి అని,వారి వైపు అవతరింపబడిన దివ్యవాణిని చేరవేయమని గట్టిగా వాగ్దానం తీసుకున్నప్పటి వైనమును మీరు ఒక సారి గుర్తు చేసుకోండి. దాన్ని మేము ప్రత్యేకించి మీతోను,నూహ్,మూసా, మర్యమ్ కుమారుడగు ఈసాతోను తీసుకున్నాము. వారందరితో మేము ఆమానత్ గా అల్లాహ్ సందేశాలను పూర్తిగా చేరవేయటంపై గట్టి వాగ్దానమును తీసుకున్నాము.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి