సూరా 3 · జుజ్ 3
Ali 'Imran · 3:15
۞ قُلْ أَؤُنَبِّئُكُمْ بِخَيْرٍ مِنْ ذَٰلِكُمْ ۚ لِلَّذِينَ اتَّقَوْا عِنْدَ رَبِّهِمْ جَنَّاتٌ تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا وَأَزْوَاجٌ مُطَهَّرَةٌ وَرِضْوَانٌ مِنَ اللَّهِ ۗ وَاللَّهُ بَصِيرٌ بِالْعِبَادِ
ఇలా చెప్పు: "ఏమీ? వాటి కంటే ఉత్తమమైన వాటిని నేను మీకు తెలుపనా? దైవభీతి గలవారికి, వారి ప్రభువు వద్ద స్వర్గవనాలుంటాయి. వాటి క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి, అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు మరియు వారికి అక్కడ పవిత్ర సహవాసులు (అజ్వాజ్) ఉంటారు మరియు వారికి అల్లాహ్ ప్రసన్నత లభిస్తుంది." మరియు అల్లాహ్ తన దాసులను కనిపెట్టుకొని ఉంటాడు.
తఫ్సీర్
ఓ ప్రవక్తా! ప్రకటించండి, ఈ వాంఛల కంటే ఉత్తమమైన వాటి గురించి మీకు తెలుప మంటారా ? అల్లాహ్ యొక్క ధర్మాజ్ఞలు పాటిస్తూ, ఆయన నిషేధించిన వాటికి దూరంగా ఉంటూ సదా అల్లాహ్ ను గుర్తు చేసుకుంటూ జీవితం గడిపే వారి కొరకు చెట్ల క్రింద నుండి ప్రవహించే నదులతో నిండిన ఆహ్లాదకరమైన తోటలు మరియు అందమైన భవనాలు ఉన్నాయి. అక్కడ వారు మరణించరు మరియు నశించిపోరు, శాశ్వతంగా జీవిస్తారు. వారి కొరకు అక్కడ తమ రూపురేఖలలో మరియు గుణగణాలలో ఎలాంటి లోపాలు మరియు కొరతలు లేని, అన్నీ విధాలుగా పరిశుద్ధమైన భార్యలు కూడా ఉంటారు. అదనంగా వారు అల్లాహ్ యొక్క ఇష్టత పొందుతారు. అల్లాహ్ వారిపై ఎన్నటికీ కోపగించుకోడు. అల్లాహ్ తన దాసుల చర్యలు గమనిస్తూ ఉన్నాడు. ఆయన నుండి ఏదీ దాగదు. వారు చేసే పనులకు ఆయన తగిన ప్రతిఫలం ప్రసాదిస్తాడు.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి