సూరా 17 · జుజ్ 15
Al-Isra · 17:85
وَيَسْأَلُونَكَ عَنِ الرُّوحِ ۖ قُلِ الرُّوحُ مِنْ أَمْرِ رَبِّي وَمَا أُوتِيتُمْ مِنَ الْعِلْمِ إِلَّا قَلِيلًا
మరియు వారు నిన్ను ఆత్మ (రూహ్) ను గురించి ప్రశ్నిస్తున్నారు. వారితో ఇలా అను: "ఆత్మ! నా ప్రభువు ఆజ్ఞతో వస్తుంది. మరియు (దానిని గురించి) మీకు ఇవ్వబడిన జ్ఞానం అతి స్వల్పమైనది."
తఫ్సీర్
ఓ ప్రవక్తా గ్రంధవహులలో నుండి అవిశ్వాసపరులు మీతో ఆత్మ యొక్క వాస్తవికత గురించి అడుగుతున్నారు. అయితే మీరు వారితో ఇలా పలకండి : ఆత్మ యొక్క వాస్తవికత గురించి అల్లాహ్ కి మాత్రమే తెలుసు. మరియు మీకు,సృష్టితాలన్నిటికి ఇవ్వబడిన జ్ఞానము పరిశుద్ధుడైన అల్లాహ్ జ్ఞానము ముందు చాలా తక్కువ.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి