సూరా 17 · జుజ్ 15
Al-Isra · 17:84
قُلْ كُلٌّ يَعْمَلُ عَلَىٰ شَاكِلَتِهِ فَرَبُّكُمْ أَعْلَمُ بِمَنْ هُوَ أَهْدَىٰ سَبِيلًا
వారితో ఇలా అను: "ప్రతి ఒక్కడు తనకు తోచినట్లే పనులు చేస్తాడు, కాని మీ ప్రభువుకు మాత్రం ఎవడు సన్మార్గం పొందే వాడో బాగా తెలుసు."
తఫ్సీర్
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ప్రతీ మనిషి సన్మార్గ విషయంలో,అపమార్గ విషయంలో తన పరిస్థితికి తగిన విధమైన తన పద్దతి ప్రకారం ఆచరిస్తున్నాడు. అయితే సత్యం వైపునకు మార్గం ప్రకారం సన్మార్గం పొందిన వాడెవడో మీ ప్రభువుకు బాగా తెలుసు.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి