సూరా 17 · జుజ్ 15

Al-Isra · 17:67

وَإِذَا مَسَّكُمُ الضُّرُّ فِي الْبَحْرِ ضَلَّ مَنْ تَدْعُونَ إِلَّا إِيَّاهُ ۖ فَلَمَّا نَجَّاكُمْ إِلَى الْبَرِّ أَعْرَضْتُمْ ۚ وَكَانَ الْإِنْسَانُ كَفُورًا

మరియు ఒకవేళ సముద్రంలో మీకు ఆపద వస్తే ఆయన (అల్లాహ్) తప్ప, మీరు పిలిచేవారందరూ మిమ్మల్ని త్యజిస్తారు. కాని, ఆయన మిమ్మల్ని రక్షించి, ఒడ్డుకు చేర్చినపుడు, మీరు ఆయన నుండి ముఖం త్రిప్పుకుంటారు. వాస్తవానికి మానవుడు ఎంతో కృతఘ్నుడు.

తఫ్సీర్

ఓ ముష్రికులారా సముద్రంలో మీకు ఆపద,కష్టం కలిగి చివరికి మీకు వినాశన భయము కలిగినప్పుడు అల్లాహ్ ను వదిలి మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారందరు మీ నుండి అదృశ్యమైపోతారు. మరియు మీరు అల్లాహ్ తప్ప ఇంకెవరిని గుర్తు చేసుకోరు, అప్పుడు మీరు ఆయనతోనే సహాయమును అర్ధిస్తారు. ఆయన మీకు సహాయము చేసి మీరు భయపడిన దాని నుండి మిమ్మల్ని రక్షిస్తే మీరు ఒడ్డుకు చేరినప్పుడు మీరు ఆయన ఏకత్వము నుండి,ఆయన ఒక్కడిని అర్ధించటం నుండి విముఖత చూపి,మీ విగ్రహాల వైపు మరలిపోతారు. మానవుడు అల్లాహ్ అనుగ్రహాల పట్ల కృతఘ్నుడైపోయాడు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి