సూరా 17 · జుజ్ 15

Al-Isra · 17:59

وَمَا مَنَعَنَا أَنْ نُرْسِلَ بِالْآيَاتِ إِلَّا أَنْ كَذَّبَ بِهَا الْأَوَّلُونَ ۚ وَآتَيْنَا ثَمُودَ النَّاقَةَ مُبْصِرَةً فَظَلَمُوا بِهَا ۚ وَمَا نُرْسِلُ بِالْآيَاتِ إِلَّا تَخْوِيفًا

మరియు నిదర్శనాలను (ఆయాత్ లను) పంపకుండా మమ్మల్ని ఏదీ ఆపలేదు. కాని పూర్వకాలపు ప్రజలు వాటిని తిరస్కరించడమే తప్ప! మరియు మేము సమూద్ జాతి వారికి ప్రత్యక్ష నిదర్శనంగా ఒక ఆడ ఒంటెను పంపాము, కాని వారు దాని పట్ల క్రూరంగా ప్రవర్తించారు. మరియు మేము నిదర్శనాలను (ఆయాత్ లను) పంపుతున్నది, కేవలం ప్రజలు వాటిని చూసి భయపడటానికే!

తఫ్సీర్

మృతులను జీవింపజేయటం,ఇంకా వాటి లాంటి వాటిని వేటినైతే ముష్రికులు కోరారో ప్రవక్త నీతిపై సూచించే ఇంద్రియ సూచనలను అవతరింపజేయటం మేము వదలలేదు కాని మేము పుర్వ జాతులపై వాటిని అవతరింపజేశాము అప్పుడు వారు వాటిని తిరస్కరించారు. నిశ్చయంగా మేము స్పష్టమైన పెద్ద సూచనను సమూద్ జాతివారికి ప్రసాధించాము.అది ఆడ ఒంటె. అయితే వారు దాన్ని తిరస్కరించారు. అప్పుడు మేము వారిని శీఘ్రంగా శిక్షకు గురి చేశాము.మేము ప్రవక్తల చేతికి సూచనలను ఇచ్చి పంపించేది వారి జాతులవారిని భయపెట్టటానికి మాత్రమే.బహుశా వారు భద్రంగా ఉంటారేమో.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి