సూరా 17 · జుజ్ 15

Al-Isra · 17:53

وَقُلْ لِعِبَادِي يَقُولُوا الَّتِي هِيَ أَحْسَنُ ۚ إِنَّ الشَّيْطَانَ يَنْزَغُ بَيْنَهُمْ ۚ إِنَّ الشَّيْطَانَ كَانَ لِلْإِنْسَانِ عَدُوًّا مُبِينًا

మరియు నా దాసులతో, వారు మాట్లాడేటప్పుడు మంచి మాటలనే పలకమని చెప్పు. (ఎందుకంటే) షైతాన్ నిశ్చయంగా, వారి మధ్య విరోధాన్ని రేకెత్తించడానికి ప్రయత్నిస్తుంటాడు. నిశ్చయంగా, షైతాన్ మానవుడికి బహిరంగ శత్రువు.

తఫ్సీర్

మరియు ఓ ప్రవక్తా నా పై విశ్వాసమును కనబరచే నా దాసులతో వారు మాట్లాడేటప్పుడు మంచి మాటను పలకమని,ధ్వేషమును కలిగించే చెడ్డ మాట నుండి దూరంగా ఉండమని చెప్పండి. ఎందుకంటే షైతాను వాటి ద్వారా ప్రయోజనం చెంది వారి మధ్య వారి ఇహలోక,పరలోక జీవితమును సంక్షోభములో నెట్టే చర్యలకు పాల్పడటానికి కృషి చేస్తాడు. నిశ్చయంగా షైతాను మానవునికి స్పష్టమైన శతృవు. అటువంటప్పుడు అతడు అతనితో జాగ్రత్తపడటం అత్యవసరము.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి