సూరా 16 · జుజ్ 14
An-Nahl · 16:3
خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِالْحَقِّ ۚ تَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ
ఆయన ఆకాశాలను మరియు భూమిని సత్యంతో సృష్టించాడు. వారు, ఆయనకు సాటి కల్పించే భాగస్వాముల (షరీక్ ల) కంటే ఆయన అత్యున్నతుడు.
తఫ్సీర్
అల్లాహ్ భూమ్యాకాశములను పూర్వ నమూనా లేకుండా సత్యముతో సృష్టించాడు. ఆ రెండింటిని నిష్ఫలితంగా సృష్టించలేదు. ఆ రెండింటితో తన గొప్పతనాన్ని తెలియపరచటానికి వాటిని సృష్టించాడు.అతని తోపాటు ఇతరులను వారు సాటి కల్పిస్తున్న దాని నుండి అతడు పరిశుద్ధుడు.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి