సూరా 16 · జుజ్ 14

An-Nahl · 16:2

يُنَزِّلُ الْمَلَائِكَةَ بِالرُّوحِ مِنْ أَمْرِهِ عَلَىٰ مَنْ يَشَاءُ مِنْ عِبَادِهِ أَنْ أَنْذِرُوا أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا أَنَا فَاتَّقُونِ

ఆయనే తన ఆజ్ఞతో, దేవదూతల ద్వారా, దివ్యజ్ఞానాన్ని (రూహ్ ను) తాను కోరిన, తన దాసులపై అవతరింపజేస్తాడు, వారిని (ప్రజలను) ఇలా హెచ్చరించటానికి: "నిశ్చయంగా, నేను తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు! కావున మీరు నాయందే భయభక్తులు కలిగి ఉండండి!"

తఫ్సీర్

ఓ ప్రవక్తల్లారా ప్రజలను అల్లాహ్ తోపాటు సాటి కల్పించటం నుండి మీరు భయపెట్టటానికి అల్లాహ్ వహీ ద్వారా తన నిర్ణయాన్ని తన ప్రవక్తల్లోంచి తాను ఎవరిని కోరుకుంటే వారిపై దైవదూతలను అవతరింపజేస్తాడు. అయితే నేను తప్ప ఇంకెవరూ సత్య ఆరాధ్య దైవం లేడు. కావున ఓ ప్రజలారా మీరు నా ఆదేశములను పాటిస్తూ,నేను వారించిన వాటికి దూరంగా ఉంటూ నా పట్ల భయభీతి కలిగి ఉండండి.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి