సూరా 16 · జుజ్ 14
An-Nahl · 16:119
ثُمَّ إِنَّ رَبَّكَ لِلَّذِينَ عَمِلُوا السُّوءَ بِجَهَالَةٍ ثُمَّ تَابُوا مِنْ بَعْدِ ذَٰلِكَ وَأَصْلَحُوا إِنَّ رَبَّكَ مِنْ بَعْدِهَا لَغَفُورٌ رَحِيمٌ
అయితే నిశ్చయంగా, నీ ప్రభువు - ఎవరైతే అజ్ఞానంలో పాపాలు చేసి, ఆ పిదప పశ్చాత్తాప పడి, సరిదిద్దుకుంటారో - దాని (ఆ పశ్చాత్తాపం) తరువాత (వారిని క్షమిస్తాడు); నిశ్చయంగా, నీ ప్రభువు క్షమించేవాడు, అపార కరుణా ప్రదాత.
తఫ్సీర్
ఆ తరువాత ఓ ప్రవక్తా నిశ్చయంగా నీ ప్రభువు వారికి ఎవరైతే దుష్కర్మల పరిణామం తెలియక ఒక వేళ కావాలనే వాటికి పాల్పడి ఆ పిదప దుష్కర్మలకు పాల్పడిన తరువాత వారు అల్లాహ్ తో పశ్చాత్తాప్పడి ,తమ ఆ కర్మలను వేటిలోనైతే చెడు ఉన్నదో వాటిని సంస్కరించుకుంటే నిశ్చయంగా నీ ప్రభువు పశ్చాత్తాపము తరువాత వారి పాపములను మన్నించేవాడును,వారిపై కరుణించేవాడును.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి